పయనించే సూర్యుడు న్యూస్ ఏప్రిల్ నిజామాబాద్ జిల్లా బ్యూరో టికే గంగాధర్
తెలంగాణ నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లో ఏరు గట్ల మండలం లో ఎస్సై బి.రాము
మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని ఏర్గట్ల ఎస్సై బి.రాము అన్నారు. మండల కేంద్రంలోని ఇబ్రహీంపట్నం వెళ్ళే దారిలో తీగల వాగు సమీపంలో ఆయన తన సిబ్బందితో కలిసి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ , వాహనాల తనిఖీని నిర్వహించారు . సీపీ ఆదేశాల మేరకు ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుండి 7 గంటల వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ ,వాహనాల తనిఖీ నిర్వహిస్తున్నట్లు ఎస్సై తెలిపారు వాహనదారులు మద్యం సేవించి వాహనాలు నడిపిస్తే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదు చేయబడుతుందని ,హెల్మెట్ ధరించకుండా, వాహనాలకు సంబంధించిన సరైన పత్రాలు లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆయన వెంట హెడ్ కానిస్టేబుల్ శివయ్య, సిబ్బంది సుమన్, కిషోర్ తదితరులు ఉన్నారు.