
పయనించే సూర్యుడు అక్టోబర్ 10,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న
మహానంది మండలం తిమ్మాపురం లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్నం భోజనాన్ని పరిశీలించిన ఎంపీపీ బుడ్డారెడ్డి యశస్వని, ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడి మధ్యాహ్న భోజన నిర్వహణ గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం భోజనాన్ని, స్టాక్ రూమ్‌ను పరిశీలించారు. విద్యార్థులకు అందించే భోజనం నాణ్యత విషయంలో రాజీపడేది లేదని స్పష్టం చేశారు. మెనూ సక్రమంగా అమలు చేయాలని, నాణ్యమైన భోజనం అందించాలని నిర్వాహకులకు సూచించారు. అనంతరం విద్యార్థులకు భోజనం వడ్డించి కలిసి భోజనం చేశారు. వీరితోపాటు ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి రామసుబ్బయ్య, పాఠశాల ప్రిన్సిపల్ మరియు తదితరులు పాల్గొన్నారు.

