
కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రజల పక్షానే నిలుస్తుంది
కాంగ్రెస్ ను గెలిపించండి…అభివృద్ధికి బాటలు వేయండి
15 వార్డు కాంగ్రెస్ అభ్యర్థి కోళ్ల సంధ్య వెంకటేష్
{పయనించే సూర్యుడు} {న్యూస్ జనవరి 6 మక్తల్}
మక్తల్ మున్సిపల్ 15వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోళ్ల సంధ్య వెంకటేష్. గెలుపే లక్ష్యంగా జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డు వ్యాప్తంగా ఇంటింటి ప్రచారాన్ని కొనసాగించారు.
వార్డులోని వివిధ కాలనీల్లో పర్యటించి ప్రజలతో మమేకమై మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రజల పక్షానే నిలుస్తుందని, ప్రజల విశ్వాసమే తమకు అసలైన బలమని వారు స్పష్టం చేశారు. 15వ వార్డు సమగ్ర అభివృద్ధే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఈ సందర్భంగా తాగునీటి సమస్య, డ్రైనేజ్, రోడ్ల అభివృద్ధి, పారిశుధ్యం, పేదల సంక్షేమం వంటి మౌలిక అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని హామీ ఇచ్చారు. కాలనీ వాసులు ఎదుర్కొంటున్న సమస్యలకు ప్రాధాన్యత ఇస్తూ దశలవారీగా పరిష్కారాలు చూపుతామన పేర్కొన్నారు. ఇంటింటి ప్రచారంలో కాంగ్రెస్ సీనియర్ మరియు కాలనీవాసులు, స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో పాటు కాలనీ మహిళలు, యువత, పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ మద్దతు తెలిపారు

