పయనించే సూర్యుడు జనవరి 10 హసన్ పర్తి మండలం ప్రతినిధి పోగుల పోగుల రాజ్ కుమార్
హనుమకొండ జిల్లా మనవార్తప్రతినిధి కొడెపాకశ్రీకాంత్ జనవరి 10: వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని మాజీ చీఫ్ విప్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్ భద్రకాళి అమ్మవారు, శ్రీ వెంకటేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ప్రజలందరు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలుపుతూ మనవార్త రిపోర్టర్ కొడెపాక శ్రీకాంత్ నిర్వహిస్తున్న మన వార్త దినపత్రిక నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు అనంతరం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ ప్రభుత్వానికి ప్రభుత్వం నుండి వెలువడే ప్రతి విషయాలను ప్రజలకు చేరవేస్తూ నిత్యం ప్రజల కోసం నిరంతరం ప్రజాసేవలో ప్రజల పక్షానఉండి అందరికంటే ముందు ఉండాలని మన వార్త పత్రిక అని అన్నారు మనవార్త యజమాన్యానికి జిల్లా స్టాఫ్ ని అభినందించారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ బిఆర్ఎస్ కోఆర్డినేటర్ పులి రజినీకాంత్, కార్పొరేటర్లు సోదా కిరణ్, కొండపాక రఘు,నైమ్,కృష్ణ,వీరు,శ్రీకాంత్, నరేందర్,సందేల రాజు మాదిగ, జర్నలిస్ట్ ఫోరం జిల్లా అధ్యక్షుడు రాము, తదితరులు పాల్గొన్నారు