పయనించే సూర్యుడు జనవరి 29 డివిజన్ ప్రతినిధి సిరందాసు వెంకటేశ్వర్లు దేవరకొండ జిల్లా నల్గొండ:-
అకలాసియా కార్డియా అనేది ఒక అరుదైన వ్యాధి మెల్లమెల్లగా అత్యంత తీవ్రతరం అయ్యే ఈ వ్యాధి 10 వేల మందిలో ఒకరికి వచ్చే అవకాశం ఉంటుంది నోటిద్వారా ఆహారాన్ని తీసుకోలేకపోవడం ఈ వ్యాధికి ఉన్న ప్రధానమైన లక్షణం, వ్యాధి ముదిరిన కొద్దీ రోగి ఆహారం అందక నీరసించి ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది. ఇంతకు ముందు రోజుల్లో దీనికి శస్త్ర చికిత్స మాత్రమే ఒకే ఒక పరిష్కారం. కానీ మలక్ పేట యశోదా హాస్పిటల్ అత్యంత అధునాతన వైద్య రీతిలో దీనికి మైరుగైన చికిత్సను అందించి ఓ 44 సంవత్సరాల వ్యక్తి ప్రాణాలను కాపాడింది రంగారెడ్డి అనే 44 సంవత్సరాల వ్యక్తి గత 10 సంవత్సరాలుగా ఆహార పదార్థాలను మింగడానికి చాలా ఇబ్బంది పడుతిన్నాడు. 6 నెలలుగా అతను ద్రవ పదార్ధాలను తీసుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతిన్నాడు. అత్యంత క్లిష్టమైన పరిస్థితిలో అతనిని మలక్ పేట యశోదా ఆసుపత్రికి తీసుకొచ్చారు. పరీక్షలు జరిపిన తర్వాత అతనికి ఉన్న జబ్బు అకలాసియా కార్డియా టైప్ 1 అని నిర్ధారించారు. డా. కిషన్ నున్సవత, కన్సల్టెంట్ మెడికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ ఆధ్వర్యంలో పి.ఓ.ఈ.ఎమ్(పర్ ఒరల్ ఎండోస్కోపిక్ మైయోటమి) ఎండోస్కోపీ చికిత్సద్వారా అతనికి కలుగుతున్న బాధను, ఆహారం తీసుకోవడానికి ఉన్న ఇబ్బందిని నయం చేశారు. ఎండోస్కోపీ విధానంలో చికిత్స చేసిన 24 గంటల తర్వాత అతను చక్కగా నోటిద్వారా ఆహారం తీసుకోగలుగుతోందని మలక్ పేట యశోదా వైద్య బృందం తెలిపింది. ప్రస్తుతం అతను వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని, నోటిద్వారా ఆహారం తీసుకోవడానికి అతనికి ఎలాంటి ఇబ్బందీ లేదని యశోదా వైద్య బృందం తెలిపింది. మలక్ పేట యశోదా ఆసుపత్రిలో అత్యంత అధునాత సౌకర్యాలు, సాంకేతిక- వైద్య పరిజ్ఞానం, చికిత్సా పద్ధతులతో కూడిన గ్యాస్ట్రో ఎంటరాలజీ చికిత్స అందుబాటులో ఉందని, అత్యంత క్లిష్టతరమైన వ్యాధులకు కూడా యశోదా వైద్య బృందం చక్కటి చికిత్సను, పరిష్కారాలను అందజేస్తోందని యశోదా హాస్పిటల్ డైరెక్టర్ గోరుకంటి పవన్, యునిట్ హెడ్ కె.శ్రీనివాస్ రెడ్డి, శ్రీనివాస్, డాక్టర్, నుసావత్ కిషన్, జిఎం శ్రీనివాస్, వాస కిరణ్, వెంకటేష్, జితేందర్, రాజశేఖర్, చిదుర తెలిపారు.