
పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో : ధాన్యం నిల్వలకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు వెల్లడించిన ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ రైతులు పండించిన ధాన్యం విలువలకు ఇబ్బందులు కలగకుండా బైంసా మండలంలోని మహగాం గ్రామంలో గోదాముల నిర్మాణానికి ప్రభుత్వం పది ఎకరాల స్థలం కేటాయించడం జరిగిందని ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ వెల్లడించారు. బుధవారం హైదరాబాదులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రొసీడింగ్ ను (జిల్లా కలెక్టర్ ఉత్తర్వు కాపీని) అందించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. విఠలేశ్వర ఆలయం వెనుక ఉన్న 218 సర్వే నంబర్ లో 10 ఎకరాల ప్రభుత్వ భూమిని గుర్తించడం జరిగిందని, ఈ భూమిని తెలంగాణ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ కు గోదాముల నిర్మాణం కోసం కేటాయిస్తూ ప్రతిపాదించడం జరిగిందన్నారు.. 10 ఎకరాల స్థలంలో పదివేల నుంచి 20 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం ఉన్న సైంటిఫిక్ గోడౌన్స్ నిర్మించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. స్థలము అప్పగించిన తర్వాత నిర్మాణం ప్రారంభమవుతుందని చెప్పారు. ఈ సందర్భంగా మహాగాం సర్పంచ్ అప్పల రాజ్యలక్ష్మి రాకేష్ మాట్లాడుతూ తమ గ్రామంలో గోదాముల నిర్మాణానికి నిధులు మంజూరు చేయించినందుకు ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ కు కృతజ్ఞతలు చెప్పారు. ప్రభుత్వం వేగవంతంగా గోదాముల నిర్మాణ ప్రక్రియ ప్రారంభించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.