పయనించే సూర్యుడు హుజురాబాద్ ప్రతినిధి దాసరి రవి : హుజురాబాద్ పట్టణానికి చెందిన గంగిశెట్టి మధురమ్మ మెమోరియల్ ఫస్ట్ వారి ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా 25 కిలోల రైస్ బ్యాగును ట్రస్ట్ నిర్వాహకులు గంగిశెట్టి జగదీశ్వర్ (రిటైర్డ్ టీచర్ ) మూత్రపిండాల వ్యాధితో బాధపడుతూ మంచానికే పరిమితమైన పల్లవేని దాసుకు 25 కిలోల రైస్ బ్యాగును అందజేశారు. పల్లవినేని దాసు శ్రీ గనిశెట్టి లచ్చయ్య ఇంటి ప్రక్కనగల సందిలో రేకుల రూమ్ లో కిరాయికి నివాసం ఉంటూ గత ఆరు సంవత్సరముల నుండి మూత్రపిండాల వ్యాధితో బాధపడుతూ మంచానికే పరిమితమై దుర్భర జీవితము కొనసాగిస్తున్నాడు. ఈయనకు నెలకు రెండు వేల రుద్రప్ప పెన్షన్ మాత్రమే వస్తుంది. అ పెన్షన్ ఆయన మందులకు సరిపోవడం లేదని లేవనేని పరిస్థితుల్లో ఉన్న భర్తకు సేవలు చేస్తూ,పూట గడవడం కోసం భార్య శకుంతల ఇతర ఇండ్లలో మిగిలిన చలి అన్నం తెచ్చుకొని జీవనము కొనసాగిస్తున్నారు. వారి పరిస్థితిని గమనించిన గంగిశెట్టి జగదీశ్వర్ 25 కిలోల బియ్యం బ్యాగును మరోసారి అందజేశారని తెలిపారు. గతంలో రెండు మాసాలకు సరిపడు గాసము కూడా అందించడం జరిగిందని అన్నారు. ఎవరైనా దాతలు ముందుకు వచ్చి తోచిన సహాయం చేయాలని అభ్యర్థిస్తున్నారు. మన ప్రభుత్వం ఇస్తున్న ఇందిరమ్మ ఇల్లు సాంక్షన్ చేసిన లిస్టులో తన పేరు లేదని దయచేసి రెండవ లిస్టులో తన పేరు చేర్చి ఆపదలో ఉన్న ఈ ముసలి జంటను ఆదుకోవాలని ప్రార్థిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకుడు వేల్పుల ప్రభాకర్,రిటైర్డ్ వెల్ఫేర్ ఆఫీసర్ సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.