పయనించే సూర్యుడు, జనవరి 30, దేవరకొండ టౌన్ న్యూస్ రిపోర్టర్, నరేష్ నల్గొండ జిల్లా.
దేవరకొండ టౌన్ న్యూస్, గాంధీ బజార్ నందు స్వాతంత్ర్యం సమరయోధులు జాతిపిత మహాత్మా గాంధీ గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకులు కంబాలపల్లి వెంకటయ్య దేవరకొండ లైన్స్ క్లబ్ అధ్యక్షులు వస్కుల సత్యనారాయణ ఈ సందర్భంగా మాట్లాడుతూ మహాత్మా గాంధీ మన భారతదేశం స్వాతంత్ర్యం కోసం మన దేశాన్ని మనమే పరిపాలించాలని బ్రిటిష్ వారిని మన దేశం వదిలే పెట్టి పోయ్యే వరకు ఆహింస మార్గంలో శాంతియుతంగా వేలాది మందిని ఏకం చేసి 1947 ఆగస్టు 15న అర్ధరాత్రి 12 గంటలకు మన దేశానికి స్వాతంత్ర్యం తీసుకువచ్చి మన దేశానికి విముక్తి కల్పించి ప్రజలకు స్వేచ్ఛ తీసుకువచ్చిన జాతిపిత మహాత్మా గాంధీ అని వారు కొనియాడారు ఈ కార్యక్రమంలో దేవరకొండ మాజీ కౌన్సిలర్ పొట్ట సుగుణయ్య పొట్ట విజయ్ కుమార్ ఎంఆర్పిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎర్ర ఆంజనేయులు ఎమ్మార్పీఎస్ జిల్లా కార్యదర్శి ఆరెకంటి యేసయ్య కాంగ్రెస్ పార్టీ నాయకులు అంకూరి శివ తదితరులు పాల్గొన్నారు.