
పయనించే సూర్యుడు ఏప్రిల్ 11 ముమ్మిడివరం ప్రతినిధి
ప్రఖ్యాత సామాజిక తత్వవేత్త, ఉద్యమకారుడు మహాత్మా జ్యోతిరావు పూలే 200 వ జయంతి సందర్భంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ఐ. పోలవరం గ్రామంలో జిల్లా పరిషత్స్మృ ప్రాధమిక పాఠశాల నందు ఉన్న అయన విగ్రహానికి పూలమాలలతో ఘన నివాళులు అర్పించిన మాజీ ఎమ్మెల్యే చెల్లి వివేకానంద , రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ చెల్లి అశోక్ , మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సాగిరాజు సూరిబాబు రాజు , గ్రామ కమిటీ అధ్యక్షులు బొంతు ప్రసాద్ మరియు ఇతర నాయకులు.
ఈ కార్యక్రమం లో వక్తలు మాట్లాడుతూ అభ్యున్నతి, అంతరానితనం, కులవ్యవస్థ నిర్మూలనకు ఆయన చేసిన సేవలను కొనియాడారు. విద్యా వ్యాప్తికి సమాజాన్ని తీర్చిదిద్దేందుకు ఆయన చేసిన కృషిని ప్రశంసించారు. ఆయన జయంతిని ప్రజాభివృద్ధి దిశగా ముందుకు నడిపించేందుకు స్ఫూర్తిగా తీసుకోవాలని పేర్కొన్నారు. సామాజిక సమానత్వానికి అంకితభావంతో పనిచేసిన గొప్ప సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే. ఆయనను స్ఫూర్తిగా తీసుకుని వారి ఆశయ సాధనకు అందరం కృషి చేయాలని పిలుపునిచ్చారు.