//పయనించే సూర్యుడు//న్యూస్// ఫిబ్రవరి8 మక్తల్
కోల్పూర్ గ్రామం మాగనూరు మండలం నారాయణపేట జిల్లా పరిధిలోని కోల్పూర్ గ్రామపంచాయతీ కార్యదర్శి భాస్కర్ కు మహాత్మ జ్యోతిబాపూలే వారధి కమిటీ వ్యవస్థాపకులు మరియు కమిటీ సభ్యులు కలిసి వినతి పత్రం అందజేయడం జరిగింది ఈ వినతిపత్రంలో మంగళవారం అంటే 11/02/2025 నాడు కోల్పూర్ గ్రామపంచాయతీ పరిధిలో జరగబోయే అతి పెద్ద జాతర గజ్జలమ్మ జాతర సందర్భంగా కోల్పూర్ గ్రామంలో ప్రజలకు .దోమల నివారణ.త్రాగునీటి వసతి
ప్రథమ చికిత్స కేంద్రం నీడ వసతిని కల్పించడం డ్రైనేజీ వ్యవస్థను శుభ్రపరచడం కోల్పూర్ గ్రామం నుండి అమ్మవారి దేవాలయం వరకు రోడ్డు మరమ్మతులు చేపట్టడం వంటి మొదలైన సౌకర్యాలను వెంటనే కల్పించాలని గ్రామపంచాయతీ కార్యదర్శికి మహాత్మ జ్యోతిబాపూలే వారధి కమిటీ ఆధ్వర్యంలో వినతి పత్రం అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో మహాత్మ జ్యోతిబాపూలే వారధి కమిటీ వ్యవస్థాపకులు కెవి నరసింహ రాకేష్ నవీన్ నరేష్ గొల్ల నరేష్ జంగం శ్రీపాద మహేష్ కుమార్ గ్రామ పంచాయతీ కార్యదర్శి భాస్కర్ ఎరుకలి రాములు గ్రామ పెద్దలు యువకులు తదితరులు పాల్గొన్నారు