
పయనించే సూర్యుడు నవంబర్ 3,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న
కార్తీక మాసం రెండవ సోమవారం సందర్భంగా శ్రీ కామేశ్వరి మహానంది ఈశ్వర స్వామివార్లను దర్శించుకున్న రాజశేఖర్ రెడ్డి. వీరికి ముందుగా టిడిపి నాయకులు, దేవస్థానం ఈవో ఎన్ శ్రీనివాస్ రెడ్డి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం కుంకుమార్చన, అభిషేకం స్వామి అమ్మవార్లకు ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. దర్శనం అనంతరం కళ్యాణ మండపం నందు ఈవో, ఏఈఓ మధు మెమొంటో ఇచ్చి, వేద మంత్రోచ్ఛారణలతో ఆశీర్వాదం చేసి, తీర్థ ప్రసాదాలు అందజేసిన వేద పండితులు. ఈ కార్యక్రమంలో మహానంది తహసిల్దార్ రమాదేవి, ఎస్సై రామ్మోహన్ రెడ్డి, ఎంపీడీవో మహబూబ్ దౌలా, టిడిపి, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

