
పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) (TG ఆధ్వర్యంలో నిజామాబాద్ బస్ స్టేషన్లో మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలు సాధించిన ₹10,000 కోట్ల ఆదాయం ఆదా సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా నిజామాబాద్ మేయర్ కై ఉమారాణి గౌడ్ P.D మధుసూదన్ టీజీఎస్ఆర్టీసీ నిజామాబాద్ డిప్యూటీ రీజినల్ మేనేజర్ మధుసూదన్ నిజామాబాద్-1 డిపో మేనేజర్ B.S ఆనంద్ హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ, మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో కుటుంబాల ఆర్థిక భారం తగ్గిందని, జిల్లాలో 8.58 కోట్ల మంది ప్రయాణికులు సేవలను వినియోగించుకున్నట్లు రాష్ట్రవ్యాప్తంగా 290 కోట్ల మంది ప్రయాణికులు ప్రయాణించగా, మొత్తం రూ.10,000 కోట్ల ఆదాయం ఆదా ఇదే ఆదా ఇదే జిల్లాల్లో రూ.365.50 కోట్ల ఆదాయం ఆదా చేయబడినట్లు పేర్కొన్నారు.తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఇది ఎంతో ప్రయోజనకరంగా మారిందని తెలిపారు మహిళలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా మరింత బలపడాలని వారు సూచించారు.దేవిధంగా, ఈ కార్యక్రమం కామారెడ్డి, బాన్సువాడ, ఆర్మూర్, బోధన్, నిజామాబాద్-1 డిపోలలో కూడా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా హాజరైన సందర్భం 1) కామారెడ్డి డిపో - కలెక్టర్ ఆశిష్ సంగ్యాన్ మున్సిపాల్ చైర్మెన్ ఉమా రాణి 2) ఆర్మూర్ డిపో - మున్సిపాల్ చైర్మెన్ జి. లఘరి రఘు 3) బాన్వాడ డిపో - MLA పోచారం శ్రీనివాస్ రెడ్డి డి 4) బోధన డిపో - మున్సిపాల్ చైర్మెన్ పద్మ శరత్ రెడ్డి ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు మరియు స్దానిక మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ, ప్రభుత్వం తీసుకొస్తున్న సంక్షేమ పథకాలకు కృతజ్ఞతలు తెలిపారు.
