
పయనించే సూర్యుడు న్యూస్ :తిరుపతిలో ర్యాపిడో డ్రైవర్ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఘటన వెలుగులోకి వచ్చింది. మహిళ ఇంటికి వెళదామని రైడ్ బుక్ చేసుకున్నారు. అయితే ఇంటికి చేరుకున్న తర్వాత డ్రైవర్ పెద్దయ్య ఈ నీచానికి పాల్పడ్డాడు. మహిళ కేకలు వేయడంతో భర్త, బంధువులు స్పందించి పోలీసులకు అప్పగించారు. డ్రైవర్‌కు కౌన్సిలింగ్ ఇచ్చి, బైండోవర్ చేశారు. మహిళల భద్రతపై పోలీసులు కీలక సూచనలు చేశారు.ఏపీలో ర్యాపిడో డ్రైవర్ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. రైడ్ బుక్ చేసుకుని ఇంటికి చేరుకున్న తర్వాత ఈ నీచానికి పాల్పడ్డాడు.. తిరుపతిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా బయటపడింది. తిరుపతి సమీపంలోని అలిపిరి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆర్.ఆర్.కాలనీలో ఉన్న అంకుర హాస్పిటల్ వెనుక ఓ మహిళ నివాసం ఉంటున్నారు. ఈ నెల1వ (శనివారం) తేదీన రాత్రి ఆమె బ్యూటీ పార్లర్ నుంచి ఇంటికి వెళ్లేందుకు ర్యాపిడోలో బైక్ బుక్ చేసుకున్నారు. ర్యాపిడో బైక్ కెప్టెన్ వచ్చాడు.. ఆమెను బైక్‌పై ఎక్కించుకుని బయల్దేరాడు.ఆమె ఇంటికి చేరుకున్న తర్వాత ర్యాపిడో కెప్టెన్ పెద్దయ్య ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. వెంటనే ఆమె అతడ్ని నిలువరించింది.. మహిళ పెద్దగా కేకలు వేయడంతో భర్త, బంధువులు బయటకు వచ్చారు. వెంటనే ర్యాపిడో కెప్టెన్‌ను పట్టుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. అదే సమయంలో నైట్ పెట్రోలింగ్ పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకుని అలిపిరి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. మహిళల ఇచ్చిన ఫిర్యాదుతో అతడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అతడికి కౌన్సిలింగ్ ఇచ్చారు.. మరోసారి ఈ తప్పు చేయకుండా తిరుపతి తహసీల్దార్ దగ్గర ఏడాదిపాటు బైండోవర్ చేసినట్లు తెలుస్తోంది.తిరుపతి పోలీసులు ప్రజలకు, ముఖ్యంగా మహిళలకు కీలక సూచనలు చేశారు. ఏదైనా సమస్య ఎదురైతు వెంటనే దగ్గరలోని పోలీస్ స్టేషన్, 100,112,181 వంటి ఎమర్జెన్సీ నంబర్లకు సమాచారం ఇవ్వాలన్నారు. మహిళల భద్రత అందరి బాధ్యతన్నారు. మహిళల పట్ల అమానుషంగా ప్రవర్తిసే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎవరైనా మహిళలు బైక్ ట్యాక్సీ సర్వీసులు ఉపయోగించే సమయంలో.. ముందుగా కెప్టెన్ (రైడర్) ఫోన్ నంబర్, పేరు, వెహికల్ నంబర్ వంటి వివరాలను కుటుంబసభ్యులకు షేర్ చేయాలి అంటున్నారు. ముందస్తు జాగ్రత్తగా ఆ సమయంలో లైవ్ లొకేషన్ షేర్ చేసేలా ఆప్షన్ ఆన్ చేసుకోవాలంటున్నారు. ఒకవే రాత్రి సమయంలో ప్రయాణించాల్సి వస్తే మహిళా రైడర్, వెరిఫైడ్ డ్రైవర్ల సర్వీస్‌ను ఎంపిక చేసుకోవాలని సూచిస్తున్నారు. రైడర్ తీరు అనుమానాస్పదంగా ఉంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలంటున్నారు. రైడ్ పూర్తయ్యాక కుటుంబసభ్యులకు సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు.