పయనించే సూర్యుడు న్యూస్ సెప్టెంబర్ 27(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి) యాడికి
మహిళల ఆరోగ్య సంరక్షణకు ప్రభుత్వాలు పెద్దపీట వేస్తున్నాయని తాడిపత్రి మలేరియా సబ్ యూనిట్ అధికారి చిగురుపాటి శ్రీనివాసులు పేర్కొన్నారు.స్వస్ నారి స శక్తి పరివార్ అభయాన్ కార్యక్రమంలో భాగంగా యాడికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పరమేశ్వర్ ,డాక్టర్ సాయి సుమంత్ రెడ్డి ఆధ్వర్యంలో శనివారం మండలంలోని నిట్టూరు గ్రామ సచివాలయంలో ప్రజలకు ఉచిత వైద్య శిబిరము ఏర్పాటు చేశారు. ప్రజలకు బాలింతలు గర్భవతులకు హిమోగ్లోబిన్, బీపీ ,షుగరు ,క్యాన్సర్ వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరంశ్రీనివాసులు మాట్లాడుతూ శిబిరానికి వచ్చిన ప్రజలకు వ్యక్తిగత పరిసరాల పరిశుభ్రత, సీజనల్ వ్యాధులు డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ ,చికెన్ గునియా, విష జ్వరాలు రాకుండా ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు.ఈ కార్యక్రమంలో సూపర్వైజర్లు రాంప్రసాద్ గౌడ్ ,శోభకుమారి ఏఎన్ఎంలు సరస్వతీ రాజామణి ఎం ఎల్ హెచ్ పి లు హర్షిత శ్వేతా మాధురి అంగన్వాడీ టీచర్లు ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు