
పయనించే సూర్యుడు న్యూస్ :ఇండియన్ క్రికెట్ హిస్టరీలో నవంబర్ 2 మరచిపోలేని రోజు. ఎన్నాళ్లుగానో ఎదురు చూసిన కల నేరవేరిన రోజు. మహిళా ప్రపంచకప్‌లో మన నారీమణులు విజేతలుగా నిలిచిన రోజు. తొలిసారి ఉమెన్స్ క్రికెట్ టీమ్ విశ్వ విజేతలుగా ఆవిర్భవించారు. వరల్డ్‌కప్‌ను గెలుచుకున్నారు. ఈ విజయాన్ని యావత్ భారతదేశం ఎంతో గొప్పగా సెలబ్రేట్ చేసుకుంది. ఈ విజయంపై సినీ సెలబ్రిటీలు ఎక్స్ వేదికగా స్పందించారు. ఉమెన్స్ క్రికెట్ టీమ్‌ను అభినందించారు.
‘ఇండియన్ క్రికెట్ చరిత్రలో ఇదొక హిస్టారికల్ డే. ఇలాంటి సంచలన విజయం సాధించిన మహిళా క్రికెట్ జట్టుకు అభినందనలు. ఇది కలలు కనే ధైర్యం చేసిన ప్రతి యువతీ విజయం, వారిన నమ్మిన తల్లిదండ్రులు, వారిని ఎంకరేజ్ చేసిన అభిమాని విజయం..ఇలాగే మీరు విజయాలను సాధిస్తూ ఉండండి’ - చిరంజీవి
‘భారత క్రికెట్ చరిత్రలో ఇదొక అద్భుతమైన రోజు. ఈ కిరీటం పొందటానికి మన క్వీన్స్ అర్హులు. ఇవి చాలా స్పెషల్ మూమెంట్స్. తొలిసారి ఇండియా మహిళల ప్రపంచ కప్ గెలుచుకుంది. ఈ విజయం కోసం వారెంతో శ్రమించారు’ - వెంకటేష్
‘దీప్తి ఆల్ రౌండర్ పెర్ఫామెన్స్‌తో ఆకట్టుకుంది. షెఫాలి గొప్ప ఇన్నింగ్స్ ఆడింది. భారతీయుల హృదయం గర్వంతో ఉప్పొంగిపోతుంది’ - రాజమౌళి
‘మీ అద్భుతమైన విజయానికి భారతీయులంతా సలాం చేస్తున్నారు. భారత దేశ కీర్తి సగర్వంగా ఎగురుతోంది. ప్రపంచ చాంపియన్లుగా మహిళా జట్టుకు అభినందనలు. ఎంతో ధైర్యంగా, ఉత్సాహంగా విజయాన్ని దక్కించుకున్నారు ’ - ఎన్టీఆర్
వీరితో పాటు అడివి శేష్, ప్రియాంక చోప్రా, కియారా అద్వానీ, అనుష్క శర్మ, త్రిప్తి దిమ్రి తదితరులు మహిళా క్రికెట్ టీమ్‌కు అభినందనలు.