మహిళా శక్తి కార్యక్రమం ద్వారా మహిళలు అభివృద్ధి చెందాలి
టేకులపల్లి ఎం. పి.డి.వో. బి మల్లేశ్వరి
పయనించే సూర్యుడు జులై 8(పొనకంటి ఉపేందర్ రావు )
టేకులపల్లి :రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం ప్రత్యేకంగా ప్రవేశపెట్టిన మహిళా శక్తి కార్యక్రమం ప్రతి మహిళ వినియోగించుకుని తద్వారా ప్రతి మహిళా లక్షాధికారి కావాలని గ్రామంలో ఉన్న అన్ని కుటుంబాలలో పేదరికం తగ్గి దేశాభివృద్ధిలో రాష్ట్ర అభివృద్ధిలో మహిళలు ముందు ఉండాలని స్థానిక రేకులపల్లి మండల పరిషత్తు అభివృద్ధి అధికారిని బి మల్లీశ్వరి అన్నారు మహిళా శక్తి విజయోత్సవాలు 2025 లో భాగంగా ఈరోజు జరిగిన టేకులపల్లి మండల మహిళా సమాఖ్య ప్రత్యేక సమావేశంలో పాల్గొని ప్రసంగించారు ఆమె మాట్లాడుతూ ఏ కార్యక్రమం చేయాలన్న మహిళలు ప్రధానమని మహిళలు తలుచుకుంటే సాధ్యం కానిది ఏమీ లేదు అని అన్నారు ఇందిర మహిళ శక్తి పాలసీలో భాగంగా గ్రామాలలో మిగిలిపోయిన అందరూ మహిళలను కొత్త సంఘాలుగా తయారు చేయాలని సూచించారు అలాగే బ్యాంకుల ద్వారా తెలియని ద్వారా ఇతర ఆర్థిక సంస్థల ద్వారా ఎక్కువ రుణాలను తీసుకొని ఆదాయ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి పేదరికం తగ్గించుకోవాలని సూచించారు మండలంలో ఉన్న వనరులను ఉపయోగించుకొని మంచి ఆదాయ అభివృద్ధి కార్యక్రమాలను చేయడంలో ఎలాంటి సహాయం కావాలన్నా చేస్తామని సలహా ఇచ్చారు మహిళలు వంటింటికే పరిమితం కాకుండా అన్ని రంగాలలో ముందు ఉండేందుకు కృషి చేయాలి అన్నారు గ్రామాలలో పారిశుధ్య మెరుగుపడేందుకు ఇంకుడు గుంతల నిర్మాణం చేసుకోవాలని ప్రతి రైతు పొలంలో ఇంకుడు గుంతలు తొవ్వుకొని మంచి పంటలు పండించుకోవాలన్నారు. మహిళలు తయారు చేసే ఉత్పత్తులకు మంచి గిరాకీ ఉందని ఎవరైతే మహిళలు ముందుకు వచ్చి వారి ఉత్పత్తులను తయారు చేసుకోవడం కోసం మాఫీతో కూడిన రుణాలు కూడా ఇప్పించేందుకు కృషి చేస్తాము అన్నారు ముఖ్యంగా మండలంలో గతంలో చేపట్టిన శానిటరీ నాప్కిన్ విప్పపువ్వు సేకరణ మహిళా శక్తి క్యాంటీన్ ఆహార పదార్థాల తయారీ మరియు ఇతర అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయని భవిష్యత్తులో కూడా ఇంకా ఏమైనా ఉత్పత్తి పరమైన వ్యాపారాలకు చేయూతనందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఏటీఎం రవికుమార్ మాట్లాడుతూ ఇందిరా మహిళ శక్తి పాలసీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని రావడం చాలా సుభదాయకమని ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం సెర్ప్ ద్వారా ఆశించిన అన్ని కార్యక్రమాలను పూర్తిచేసేందుకు ఒక క్రమబద్ధమైన ప్రణాళిక చేస్తున్నట్టు సభ్యులకు వివరించారు ముఖ్యంగా కిశోర బాలికల సంఘాలను ఇంకా సంఘంలో చేరకుండా మిగిలిపోయిన మహిళలను మరియు 60 సంవత్సరాలు పైబడిన వృద్ధులతో ప్రత్యేక సంఘాలు మరియు వికలాంగుల సంఘాలు తయారు చేయడం. జరుగుతుందని అన్నారు అలాగే అర్హత ఉన్న ప్రతి గ్రూప్ కి 20 లక్షలు బ్యాంకు రుణం ఇప్పించేందుకు ప్రణాళికలు చేస్తున్నట్లు ఆర్థిక సంవత్సరంలో అన్ని సంఘాలకు రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులతో ఇప్పటికీ అనుసంధానం చేశామని తెలియజేశారు కల్తీ లేని ఆహార ఉత్పత్తులను తయారు చేసేందుకు పిఎం ఎఫ్ఎంఈ పథకం ద్వారా మండలంలో ఇప్పటికే ఐదు కేంద్రాలను ప్రారంభించినట్లు భవిష్యత్తులో ఇంకా ఎవరికైనా కావాలంటే కూడా సహకారం అందిస్తామన్నారు మహిళా శక్తి క్యాంటీన్ కోరమేను చేపల పెంపకం పుట్టగొడుగుల తయారీ తదితర కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి పెడుతున్నట్టు తెలియజేశారు మండలంలో వ్యవసాయ రంగం ని అభివృద్ధి చేసేందుకు మునగ సాగు ద్వారా రైతులు పండిస్తున్న కాయలను ఆకులను సేకరించి వాటిని ప్రాసెస్ చేసి ఎగుమతి చేసే విధంగా ప్రణాళిక చేయాలని సూచించారు బుధవారం అన్ని గ్రామాలలో గ్రామ సంఘాల ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి ఇద్దర మహిళ శక్తి విజయ ఉత్సవాలు జరుపుకునేందుకు ఏర్పాటు చేశామన్నారు అందుకుగాను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహిళల కోసం ప్రవేశపెట్టిన అన్ని రకాల పథకాలను వివరించి ఒక పండగ వాతావరణం లో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు చేస్తున్నట్టు వివరించారు ఈనెల 12వ తారీకు నుండి 18 వ తారీకు వరకు మహిళా శక్తి విజయోత్సవాల కార్యక్రమాన్ని మండలంలో మరియు నియోజకవర్గంలో గౌరవ శాతం సభ్యుల వారి చేతుల మీదుగా కొన్ని ప్రారంభోత్సవాలు చేసేందుకు ఇప్పటికే ప్రణాళికలు చేస్తున్నట్టు వివరించారు ఈ కార్యక్రమంలో సీసీలు సునీల్ కుమార్ నాగేశ్వరరావు నరేష్ శ్రీలత సావిత్రి నాగమణి అకౌంటెంట్ సమ్మయ్య మండల సమాఖ్య సభ్యులు పాల్గొన్నారు