
పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలివెలుగుల చక్రపాణి భైంసా
మండలంలోని కుంసర గ్రామనికి సంబంధించి 10 లక్షల నిధులతో (V.O బిల్డింగ్) మహిళా సమాఖ్య సంఘ భవన నిర్మాణానికి సంబంధించిన మంజూరు పత్రాన్ని ముధోల్ శాసనసభ్యులు పవార్ రామారావు పటేల్ అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మహిళల అభ్యున్నతే దేశాభివృద్ధికి పునాది అని పేర్కొన్నారు. మహిళలు ఆర్థికంగా, సామాజికంగా బలపడినప్పుడే సమాజం ముందుకు సాగుతుందని తెలిపారు.కేంద్ర ప్రభుత్వం మహిళల సంక్షేమం కోసం అమలు చేస్తున్న పలు పథకాలను వివరిస్తూ, ప్రతి మహిళకు బ్యాంకు ఖాతా కల్పించి ఆర్థిక స్వావలంబనకు బాటలు వేసిందని అన్నారు. అలాగే స్వయం ఉపాధి చేసుకునే మహిళలకు తక్కువ వడ్డీతో రుణాలు అందిస్తూ, స్వంతంగా నిలబడే అవకాశాలు కల్పిస్తోందని తెలిపారు.మహిళలు ఈ పథకాలను సద్వినియోగం చేసుకొని అభివృద్ధి సాధించాలని, మహిళా సమాఖ్య సంఘాల ద్వారా ఐక్యతతో పనిచేస్తూ స్వయం ఉపాధి మార్గాలను విస్తరించాలని ఆయన పిలుపునిచ్చారు. వారితో పాటు సర్పంచ్ గంగాధర్ పటేల్ , భైంసా మండల మాజీ జడ్పీటీసీ సోలెంకే భీమ్ రావు , మరియు గ్రామ సమైక్య సంఘ సభ్యులు ఉన్నారు.
