
దేవుని బండ తండా మహిళా సమైక్య భవనం ప్రారంభోత్సవం
మహిళలకు అండగా ఉండే ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం
త్రాగునీరు నీళ్ల సంపు పైప్ లైన్ కోసం తక్షణమే 10లక్షలు మంజూరు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఎప్పటికి రుణపడి ఉంటాము
ముడవత్ శ్రీను దేవుని బండ తండ గ్రామపంచాయతీ సర్పంచ్
( పయనించే సూర్యుడు ఏప్రిల్ 22 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్)
ఫరూక్నగర్ మండలంలోని దేవుని బండ తండాలో పది లక్షలతో మంజూరైన మహిళా సంఘం భవనము మంగళవారం తండా సర్పంచ్ మూడవత్ శ్రీను అధ్యక్షతన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ చేతులమీదుగా ఘనంగా ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ… గిరిజనులు అంటేనే మంచి మనసున్న వారు వాస్తవాలు అవాస్తవాలు గ్రహించగల మేధావులు ఎవరు పనిచేస్తున్నారు. ఎవరు చేస్తలేరు చాలా స్పష్టంగా గ్రహిస్తారు మాట ఇచ్చిన విధంగా తండా గ్రామపంచాయతీకి మొదటిగా మహిళా సమైక్య భవనము శాంక్షన్ చేసినాము ఇచ్చిన మాట ప్రకారం ఘనంగా భవనాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. అదేవిధంగా ఎమ్మెల్యే శంకర్ అంటే మీకన్నా కొడుకు లాగా మీకు త్రాగు నీటి కష్టం లేకుండా తక్షణమే 10 లక్షల రూపాయలు మంజూరు చేస్తున్నాను మిషన్ భగీరథ పైపులైను నీటి నిలువకు ఒక సంపు నిర్మించుకోని త్రాగు నీటి కష్టం లేకుండా చూడాలని గ్రామ సర్పంచ్ శ్రీను ను ఆదేశించడం జరిగింది.
అనంతరం సర్పంచ్ శ్రీను మాట్లాడుతూ…ఎలక్షన్లో హామీ ఇచ్చిన విధంగా దేవునిబండ తండ కు అడిగినవన్నీ ఇచ్చి మాకు సహాయ సహకారాలు అందిస్తున్న ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్న కు దేవుని బండ తండ ప్రజల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు .ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ బాదావత్ శ్యామ్ లాల్ గ్రామ కార్యదర్శి గీతా బాధావత్ శంకర్ వార్డు సభ్యుడు జాను సుధాకర్ ఈశ్వర్ నాయక్ సుమన్ నాయక్ పవన్ చౌహన్ బాదావత్ వీరేష్ రమేష్ చందు నాయక్ శంకర్ మారు వాలి బాయి గ్రామ యువకులు మహిళలు పెద్దలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది
