
పయనించే సూర్యుడు న్యూస్ సెప్టెంబర్ 30(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి)
యాడికి శ్రీ.పెద్దమ్మ తల్లికి దసరా శరన్నవరాత్రులలో భాగంగా తొమ్మిదవ రోజు మహిషాసుర మర్దని అలంకరణ చేయడం జరిగింది హోమాధి కార్యక్రమం షోడశోపచారాలు అన్ని నిర్వహిస్తూ మహిషాసుని దున్నపోతు మట్టి బొమ్మతో అలంకరించి మైలారి అనే అమ్మవారి ప్రతిరూపం అయిన మనిషితో సంహరించే ప్రదర్శన చేపించడం జరిగింది. పెద్ద ఎత్తున మహిళలు,పురుషులు పిల్లలు పాల్గొని చాలా ఉత్సాహవంతంగా జై పెద్దమ్మతల్లి జై జై పెద్దమ్మ తల్లి అంటూ నినాదాలు చేశారు వచ్చిన భక్తులందరికీ తీర్థ ప్రసాదాలు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం అంతా యాడికి పెద్దమ్మ తల్లి ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు

