
పయనించే సూర్యుడు న్యూస్ సెప్టెంబర్ 30(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి)
యాడికి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి శరన్నవరాత్రులలో భాగంలో దుర్గాష్టమి మహిషాసుర మర్దని చండీ హోమం దేవి శెట్టి ఫ్యామిలీ ఆధ్వర్యంలో నిర్వహించారు ముందుగా 30 మంది 10 సంవత్సరాలలోపు బాలికలను కన్యకా పూజ నిర్వహించి వారి ఆశీర్వాదం తీసుకున్నారు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు రాత్రికి మహిషాసుడు అనే దున్నపోతు లాంటి మట్టి బొమ్మను తయారుచేసి మైలారి అనే అమ్మవారి వేషధారణ ధరించిన వ్యక్తితో మహిషాసుర మర్దని కార్యక్రమం ఏర్పాటు చేసి భక్తులకు కనువిందుగా ఉందని భక్తులు కొనియాడారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరికీ తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు

