మెదక్ జిల్లా పయనించే సూర్యుడు నర్సాపూర్ నియోజకవర్గంఇన్చార్జి మహేష్ జనవరి 29:
ప్రజలచే ఎన్నుకోబడిన మహిళ ఎమ్మెల్యే అని చూడకుండా ప్రభుత్వ హామీలు నెరవేర్చడం చేతగాని కాంగ్రెస్ నాయకులు అధికారిక కార్యక్రమాలలో ప్రోటోకాల్ ఉల్లంఘిస్తూ ఎమ్మెల్యే గౌరవానికి భంగం కలిగిస్తున్నారని అన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలను పార్టీ సభలుగా మారుస్తున్నారని విమర్శించారు.గ్రామాలలో సర్పంచ్ ఎలక్షన్ కోసమే ప్రభుత్వం పథకాల ఆశ చూపుతుందని, ప్రజలు అన్ని గమనిస్తున్నారని అన్నారు.రాబోయే లోకల్ సర్పంచ్ ఎన్నికల కోసమే నాలుగు పథకాలు అంటూ మండలానికి ఒక్క గ్రామానికి మాత్రమే ఇవ్వడం సిగ్గుచేటు. కాంగ్రెస్ నాయకులకు దమ్ముంటే అన్ని గ్రామాల ప్రజలకు అర్హులైన వారందరికీ పథకాలు వచ్చేలా కృషి చేయాలి... ఇకనైనా కాంగ్రెస్ నాయకులు చౌకబారు విమర్శలు మానుకోవాలని హెచ్చరించారు. లేనిపక్షంలో సర్పంచ్ ఎలక్షన్ లో ప్రజలే తగిన బుద్ధి చెబుతారు.