పయనించే సూర్యుడు నిజాంబాద్ జిల్లా బ్యూరో టికె గంగాధర్ తెలంగాణ నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లో
వేల్పూర్ మండలంలో విలేకరి సమావేశంలో మాట్లాడుతూ
ముందెన్నడు లేని జి ఎస్ టి ని కొత్తగా అమలు లోకి తీసుకోచ్చి దేశ ప్రజలపై లక్షల కోట్ల భారం వేసిందే బిజెపి మోడీ..
ఈ సంవత్సరం ఎస్ టి పేరు మీద దేశ ప్రజల నుండి అక్రమంగా దోచిన 22 లక్షల కోట్ల నుండి కేవలం 2 లక్షల కోట్లు జి ఎస్ టి తగ్గించి ప్రజలకు ఏదో మెహర్భాని చేసినట్టు బీజేపీ నాయకులు జబ్బలు చరుచుకుంటు పోజులు కొడుతున్నరు.9 ఏండ్లలో జి ఎస్ టి పేరు మీద దేశ ప్రజల నుండి బలవంతంగా 100 లక్షల కోట్లు దోచి ఇప్పుడు కొంతమేర జి ఎస్ టి ని తగ్గించి ప్రజలకు మోడీ దసరా కానుక ఇచ్చారు అంటూ బిజెపి మొసలి కన్నీరు కారుస్తున్నది.నిజామాబాద్ బిజెపి ఎంపీ అరవింద్ నిన్న మాట్లాడుతూ తెలంగాణ లోని ప్రతి వ్యక్తి కి నెలకు 5000 మిగిల్చాము అంటున్నాడు. అంటే…..గడిచిన తొమ్మిది సంవత్సరాలుగా జి ఎస్ టి పేరు మీద ధరలు పెంచి తెలంగాణ లోని ప్రతి వ్యక్తి నుండి నెలకు 5000 చొప్పున మొత్తం 5,40,000 రూపాయలు ఇదివరకే బీజేపీ, కేంద్ర ప్రభుత్వం దోచుకున్నది అని ఒప్పుకున్నట్టే కదా దీనికి బీజేపీ ఎంపీ అరవింద్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్న.ఇంకో బిజెపి ఎంపీ రఘునందన్ మాట్లాడుతూ ఇప్పుడు ఎస్ టి తగ్గించడం ద్వారా ప్రతి కుటుంబానికి నెలకు 15000 మిగిల్చామని అంటున్నాడు.అంటే…. గడిచిన తొమ్మిది ఏండ్లుగా ప్రతి కుటుంబం నుండి నెలకు 15000 రూపాయలు చొప్పున మీరు దోచుకున్నట్టేనా అసలు ఎంపీలు దిమాక్ ఉండి మాట్లాడుతున్నారా? మిమ్మల్ని జి ఎస్ టి పెట్టుమని అడిగిన వారు ఎవరు 2017 సంవత్సరము నుండి కొత్తగా జి ఎస్ టి పెట్టి….పప్పు, ఉప్పు, సబ్బు,నూనె,షర్ట్, పాయింట్, టివి,సైకిల్ మోటార్, కారు ఇలా అన్నిరకాల వస్తువుల ధరలు పెంచి ప్రజలను పీడించింది మీ బీజేపీ ప్రభుత్వం కాదా ఇంకా ఎన్ని రోజులు ఇవే మాయమాటలతో ప్రజలను మోసం చేస్తారు..గత 9 ఏండ్లుగా జి ఎస్ టి పేరుతొ ప్రజలను ఏ విధంగా దోచుకుంటు మోసం చేసారో..ప్రజలు అన్ని గమనిస్తున్నారు సమయం సందర్బం వచ్చినపుడు మీకు ఇదే ప్రజలు ఓట్ల కోతలు పెట్టడం ఖాయం…