పయనించే సూర్యుడు సెప్టెంబర్ 3 (ఆత్మకూరు నియోజకవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డిని జిల్లా వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఆత్మకూరు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి, ఉదయగిరి నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డిలు ఆత్మకూరు నియోజకవర్గ ముఖ్య నాయకులతో కలసి మర్యాదపూర్వకంగా కలిశారు.కూటమి ప్రభుత్వం అక్రమంగా కేసులు పెట్టడంతో జైలుకు వెళ్లి బెయిల్ పై తిరిగి వచ్చిన మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డిని ఆత్మకూరు నియోజకవర్గ వైఎస్సార్సీపీ నాయకులతో కలసి విక్రమ్ రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా కాకాణి గోవర్థన్ రెడ్డిని శాలువాలతో సత్కరించారు.
కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రజావ్యతిరేక విధానాలకు అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్ర వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సారధ్యంలో పార్టీ పిలుపునిచ్చిన అన్ని కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేసేందుకు తామంతా నాయకత్వం వెంట నడుస్తామని ఈ సందర్భంగా పేర్కొన్నారు. అనంతరం వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో చేపట్టనున్న కార్యక్రమాలపై చర్చించామని ఆయన తెలిపారు