----------గొల్లపల్లి రిజర్వాయర్ కట్టింది, కాలువలు తవ్వింది, చెరువులకు నీళ్లు నింపింది టిడిపి హయాంలోనే
---------గతంలో మంత్రిగా ఉండి నియోజకవర్గము అభివృద్ధి చేసింది శూన్యం
---------అభివృద్ధి బాటలో మంత్రి సవితమ్మ అడుగు ముందుకు వేస్తున్నారు
పయనించే సూర్యుడు ఫిబ్రవరి 03( గోరంట్ల మండల ప్రతినిధి ఫక్రోద్దీన్) శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలం గోరంట్ల పట్టణం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మండల కన్వీనర్ సోమశేఖర్ తెలుగుదేశం నాయకుల తో కలిసి పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు అనంతరం మండల కన్వీనర్ సోమశేఖర్ మాట్లాడుతూ మాజీ మంత్రి శంకర్ నారాయణ ఆదివారం బీసీ సంక్షేమం చేనేత జౌళి శాఖ మంత్రి సవితమ్మ పై చేసిన వ్యాఖ్యలను ఖండించారు మాజీ మంత్రి శంకర్నారాయణ నీళ్ల గురించి మాట్లాడి నీతి మాలిన రాజకీయాలు చేస్తున్నారని పెనుగొండ నియోజకవర్గంలో గొల్లపల్లి రిజర్వాయర్ నిర్మించి కాలువలు తవ్వి చెరువులకు నీళ్లు ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీ ది అని గుర్తు చేశారు ఎవరి హయాంలో అభివృద్ధి జరిగిందో చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు వైసిపి హయాంలో మెడికల్ కాలేజ్ అన్నారు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంది గతంలో మంత్రిగా ఉండి పెనుగొండ నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి శూన్యమని కూటమి ప్రభుత్వ ము ఏర్పడ్డాక మంత్రి సవితమ్మ ఆధ్వర్యంలో నియోజకవర్గము లో అభివృద్ధి పరుగులు పెడుతోందని అభివృద్ధిని చూసి ఓర్వలేకే మాజీ మంత్రి శంకర్ నారాయణ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఇలాంటి వ్యాఖ్యలు మానుకోవాలని మండల కన్వీనర్ సోమశేఖర్ ధ్వజమెత్తారు
ఈ కార్యక్రమంలో, మండల కన్వీనర్, సోమశేఖర్, పట్టణ కన్వీనర్ రఘునాథ్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, మాజీ సర్పంచ్ నరేష్, బాలకృష్ణ చౌదరి, వేణు రాయల్, కిషోర్ రాయల్, బొబ్బిలి రామ్మోహన్ ,వాల్మీకి సోమశేఖర్, తిప్పరాజుపల్లి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు