పయనించే సూర్యుడు న్యూస్ మార్చ్ 1 బోధన్ ప్రతినిధి నిజాంబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గం లోని సాలూర మండల కేంద్రంలో ఎస్సీ వర్గీకరణ ఉద్యమంలో అసువులు బాసిన మాదిగ అమరవీర లకు శనివారం సాలూర మండలంలోని జగ్జీవన్ రాం విగ్రహం వద్ద దండోర సంఘం ఆధ్వర్యంలో మాదిగ అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సంధర్బంగ ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు శంకర్ మాట్లాడుతు ఎస్సీ వర్గీకరణ సాధనలో గతంలో జరిగిన నిరసన కార్యక్రమంలో భాగంగా గాంధీభవన్ ముట్టడి ఘటనలో అమరులైన సురేందర్ మాదిగ దామోదర్ మాదిగ మహేష్ మాదిగ ప్రభాకర్ మాదిగ భారతక్క మాదిగలను సంస్మరించుకుంటు ఘనంగా నివాళులు అర్పించడం జరిగిందన్నారు.ఈ అమరవీరుల త్యాగాల ఫలితంగా పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఉద్యమం ఫలితంగా నేడు ఎస్సీ వర్గీకరణ కల సాకారమయిందని తెలిపారు.ఈ కార్యక్రమంలో మాదిగ జర్నలిస్ట్ ఫోరం సీనియర్ నాయకులు లింబుర్ లక్ష్మణ్ మాదిగ మండల ప్రధాన కార్యదర్శి రెడ్డి దిలీప్ మాదిగ, మండల కోశాధికారి దమ్మన్ గావ్ విజయ్ మాదిగ సభ్యులు పులి ఆంజనేయులు మాదిగ సాలూర గ్రామ అధ్యక్షులు ధమన్‌గావ్ సుభాష్ మాదిగ మొండూర్ అశోక్ మాదిగ మరిగే దత్తాత్రి మాదిగ పిల్లల చాందు మాదిగ లక్ష్మణ్ మాదిగ మందర్న సాయిలు మాదిగ కుల సంఘ సభ్యులు పాల్గొన్నారు.బోధన్ పట్టణంలో బోధన్ పట్టణంలో జరిగిన మాదిగ అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో భాగంగా నాయకులు మాదిగ అమరవీరుల చిత్ర పటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో నాయకులు విద్యాసాగర్ నిగురావు రామకృష్ణ పోశేట్టి డల్ల సురేష్ లసింగారి భూమయ్య తదితరులు పాల్గొన్నారు.