పయనించే సూర్యుడు. ఫిబ్రవరి ఖమ్మం జిల్లా బ్యూరో ఇంచార్జ్ గుగులోత్ భావుసింగ్ నాయక్ ఎమ్మార్పీఎస్ ఉద్యమంలో తమ ప్రాణాలను సైతం అర్పించిన మాదిగ వీరులకు గ్రామ గ్రామాన సంస్కరణ దినోత్సవం నీ ఘనంగా నిర్వహించాలి మండల పరిధిలో విలేకరుల సమావేశంలో ఎమ్మార్పీఎస్ ఏన్కూర్ మండల ధ్యక్షులు యంగళ నరేష్ మాదిగ మాట్లాడుతూ వచ్చేనెల మార్చి 1వ తేదీన మాదిగ అమరవీరుల సంస్మరణ దినోత్సవం వేడుకలను ఘనంగా మాదిగలు ఉన్న ప్రతి గ్రామ గ్రామాన నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు 30 సంవత్సరాల ఎమ్మార్పీస్ ఉద్యమంలో మాదిగ అమరుల త్యాగాలను కీర్తిస్తూ స్మరిస్తూ ఎమ్మార్పీఎస్ ఉద్యమంలో అమరుల పాత్ర కీలకమని మాదిగ అమరుల త్యాగాలు మరువలేవని ఎటువంటి లోపాలు లేని ఎస్సీ వర్గీకరణ సాధించి అమరులకు అంకితం ఇస్తామని ఎస్సీ వర్గీకరణ ధ్యేయంగా పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ అన్న సారథ్యంలో విజయతీరాలకు అంతిమ దశకు చేరిందని మన మాదిగ బిడ్డల భవిష్యత్తుకై మన హక్కుల సాధనకై అసువులు బాసిన అమరులను స్మరిస్తూ ఏన్కూర్ మండలంలో ఉన్న మాదిగలు ఉన్న ప్రతి గ్రామ గ్రామాన మాదిగ అమర వీరుల దినోత్సవం ఘనంగా నిర్వహించి అభ్యున్నతికి కృషిచేసి అమరులైన మాదిగ వీరులకు ఘన నివాళులర్పించాలన్నారు