
పయనించే సూర్యుడు నవంబర్ 25, నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న
రైతు పక్షపతిగా సీఎం నారా చంద్రబాబు పనిచేస్తున్నారు.
రైతుల మేలుకోసమే
నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి మాది మంచి రైతు ప్రభుత్వం, రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రైతు పక్షపతిగా పాలన చేస్తున్నారు, రైతల మేలుకోసం రైతన్నా.. మీ కోసం అని నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, లోక్ సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి అన్నారు.మంగళవారం నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి ఇంటి ఆవరణలో రైతన్నా.. మీకోసం అవగాహన సధస్సు జరిగింది.ఈ సందర్బంగా ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి మాట్లాడుతూ డ్రోన్ టెక్నాలజీ, మైకనేజేషన్ టెక్నాలజీ, ప్రకృతి వ్యసాయం, ఆధునిక టెక్నాలజీ వినియోగం, ఫుడ్ ప్రాసెసింగ్, పెట్టుబడి సాయం రైతులకు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం మా ఉమ్మడి ప్రభుత్వం అని, ఉమ్మడి ప్రభుత్వం రైతుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, సీఎం చంద్రబాబు నాయకత్వంలో వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా మార్చేందుకు కృషి చేస్తున్నాం అన్నారు. 'రైతన్నా-మీకోసం కార్యక్రమాన్ని ఈ నెల నవంబర్ 24 నుండి 29 వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రైతులకు వ్యవసాయం గిట్టుబాటు కావాలనే లక్ష్యంతో ఉమ్మడి ప్రభుత్వం పంచ సూత్రాల విధానాన్ని అమలు చేస్తోందని ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి అన్నారు.నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటలు, అగ్రిటెక్ (AgriTech),ఫుడ్ ప్రాసెసింగ్,ప్రభుత్వాల మద్దతు, ఈ పంచ సూత్రాల ద్వారా వ్యవసాయ రంగంలో పెనుమార్పులు తీసుకొచ్చి, అన్నదాతలకు అన్నివిధాలా అండగా సీఎం చంద్రబాబు ప్రభుత్వం ఉంటుందని అన్నారు.ఈ కార్యక్రమంలో నందికొట్కూరు మున్సిపల్ చైర్మన్ డి. సుధాకర్ రెడ్డి, రైల్వే జోనల్ వినియోగదారుల సలహా కమిటీ మెంబర్ నాగేశ్వరావు, రైతులు చంద్రుడు, శివ, కరీం, సత్యం రెడ్డి, సురేష్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
