
పయనించే సూర్యుడు జులై22 మక్తల్ మద్వార్ గ్రామం మక్తల్ మండలం నారాయణ పేట జిల్లా పరిధిలో మద్వార్ గ్రామంలో మంగళవారం రోజు కంబారి పెద్ద మొనయ్య చనిపోవడం జరిగింది అయితే హైదరాబాద్ లో సక్రమోళ్ల నరసింహకు ఈ విషయం తెలిసిన వెంటనే కంబారి పెద్ద మొనయ్య కుటుంబ సభ్యులకు 5000 రూపాయలు సహాయం ఫోన్ పే ద్వారా ఇవ్వడం జరిగింది అయితే ఈ సహాయం చేసే కార్యక్రమం గత సర్పంచ్ ఎన్నికల సందర్బంగా సక్రమ్మోళ్ల నరసింహ ఇచ్చిన హామీని మరిచిపోలేదు ఎలక్షన్ లో గెలువక పోయిన గ్రామంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకునే గొప్ప మానవత్వం చాటుకున్న సక్రమొల నరసింహ ఎవరు చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు సహాయం చేయడం లో ముందు ఉంటారు ఇంత గొప్ప సక్రమొల నరసింహకు మద్వార్ గ్రామ ప్రజలు ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు గ్రామస్తులు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కమ్మరి బ్రహ్మయ్య అలాగే తంబలి నాగేష్. సకిరమోలా శంకరప్ప వడ్ల నర్సింలు తదితరులు పాల్గొన్నారు .