
పయనించే సూర్యుడు నవంబర్ 28 అన్నమయ్య జిల్లా టి సుండుపల్లి మండలం
మానవతా టి సుండుపల్లి వారి ఆధ్వర్యంలో వై వై ఆర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రాయవరం నందు విద్యార్థిని విద్యార్థులకు మానవతా నైతిక విలువలు అంశం పైన వ్యాసరచన పోటీలు నిర్వహించి బహుమతులు ప్రధానం చేయడమైనది. ఇందులో మొదటి బహుమతిగా మహేశ్వర్ టెన్త్ క్లాస్ 1000 రూపాయలు, రెండో బహుమతి ఇందు 750 రూపాయలు మూడో బహుమతి నాగ వైష్ణవి 500 రూపాయలు సాధించారు మానవతా పెద్దలు మాట్లాడుతూ ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో కష్టపడి చదివి తన పాఠశాలకు తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ముఖ్యంగా నైతిక విలువలను అలవర్చుకొని ఒక మంచి మానవత్వమున్న మనిషిగా ఎదగాలని కోరారు ఈ కార్యక్రమంలో మానవతా కన్వీనర్ కృష్ణంరాజు గారు ఉమ్మడి కడప జిల్లా ఆర్థిక కార్యదర్శి హరికుమార్ ఉపాధ్యక్షులు సుబ్రమణ్యం ఈసీ ఎడ్యుకేషన్ శంకర్ నాయక్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు మానవతా సెక్రెటరీ అమృ నాయక్ మరియు పాఠశాల ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు పాల్గొన్నారు