పయనించే సూర్యుడు న్యూస్ జులై 6 సూర్యాపేట జిల్లా ప్రతినిధి,
సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం తిరుమలగిరి గ్రామానికి చెందిన శ్రీమారుతి స్కూల్ విద్యార్థిని ప్రణీత రెడ్డి,స్టాండింగ్ బ్రాండ్ జంప్ లో తన అద్భుతమైన ప్రతిభతో రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైంది.మారుతి స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీలత రెడ్డి ఈ విషయాన్ని తెలియజేస్తూ ప్రణితను అభినందించారు. ఈరోజు సూర్యాపేట స్థానిక ఎస్వీ కళాశాల మైదానంలో జరిగిన జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో శ్రీ మారుతి విద్యానికేతన్ పాఠశాలకు చెందిన ప్రణీత రెడ్డి/10 విభాగంలో 60 మీటర్ రన్నింగ్ మరియు స్టాండింగ్ బ్రాండ్ జంప్ ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక అవడం జరిగింది.ఈనెల 6 నుండి హన్మకొండ లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటుంది… జరిగిన పోటీల్లో ప్రణీత రెడ్డి.అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి,రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధించింది.ఆమె కఠోర శ్రమ,అంకితభావం.మరియు సహజసిద్ధమైన.క్రీడా ప్రతిభ ఈ విజయాన్ని సాధించడానికి దోహదపడ్డాయని స్కూల్ యాజమాన్యం పేర్కొంది,ప్రణీత సాధించిన ఈ విజయం మారుతి స్కూల్ కే కాకుండా తిరుమలగిరి గ్రామానికి గర్వకారణంగా నిలిచింది.. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ శ్రీలత రెడ్డి మాట్లాడుతూ,విద్యార్థులు చదువుతో పాటు క్రీడలో కూడా రాణించాలని,ప్రోత్సహించారు, ప్రణీత రెడ్డి భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.రాష్ట్రస్థాయిలో కూడా ప్రణీత తన అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి మారుతి స్కూల్ పేరును నిలబెడుతుందని స్కూల్ ఉపాధ్యాయులు మరియు తోటి విద్యార్థులు విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రణీత రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేసిన పాఠశాల చైర్మన్ మీలా మహదేవ్, స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీలత రెడ్డి, ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు…