
ఆర్టీసీ అధికారులకు వినతి పత్రం అందజేత
(పయనించే సూర్యుడు అక్టోబర్ 28 రాజేష్)
సిద్దిపేట జిల్లా మిర్దొడ్డి మండలం తొగుట మండల గ్రామాలకు అనుసంధానంగా ఉన్న దుబ్బాక నుండి మిరుదొడ్డి వయా అందె, గుడి కందుల, లింగంపేట, తొగుట కానుగల్, గ్రామాలకు మీదుగా వెళ్లాల్సిన బస్సు, జూబ్లీ సికింద్రాబాద్ బస్సు గత పది సంవత్సరాల కాలంతో పాటు దుబ్బాక నుండి సికింద్రాబాద్కు సికింద్రాబాద్ నుండి దుబ్బాకకు వచ్చే బస్సు ఈ మధ్యకాలంలో ఆగిపోవడం చాలా బాధాకరమని అన్నారు. దుబ్బాక డిపో వద్ద ఆర్టీసీ అధికారులు భాస్కర్ ను కలిసి వినతిపత్రం అందజేయడం జరిగింది. గతంలో నడిచిన బస్సును మారుమూల ప్రాంతాల నుండి పునరుద్ధరించాలని, కోరారు. ప్రస్తుతం ఈ బస్సు నడవడం లేదు. కావున ఈ యొక్క బస్సు ను యదావిదిగా పునఃరుద్దరించాలని మనవి చేస్తూ, అందె, లింగంపేట, కాన్గల్లో తొగుట విద్యార్థులు చదువుల కోసం గజ్వెల్, హైదరాబాద్ వెళ్ళుతున్నారు. వైద్యం కోసం RVM లక్ష్మక్కపల్లి, , హైదారాబార్ లకు వెళ్ళుటకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కావున రైతులు ప్రజలు విద్యార్థుల సమస్యలను దృష్టిలో ఉంచుకొని వెంటనే బస్సును పునరుద్ధరించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో అందే గ్రామస్తులు జేఏసీ కన్వీనర్ వారాల రాజు, అందే ప్రవీణ్, చుక్క శంకర్ కుమార్ పరశురాములు యాదగిరి సత్యం అఖిల్ గౌడ్, పోచయ్య పోచయ్య తరుణ్, తదితరులు పాల్గొన్నారు.