పయనించే సూర్యుడు అక్టోబర్ 18 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్
ఏన్కూరు వ్యవసాయ మార్కెట్ నూతన కమిటీని అభినందించిన వైరా ఎమ్మెల్యే, మాలోతు రాందాస్ నాయక్.
ఏన్కూర్. ఏన్కూరు వ్యవసాయ మార్కెట్ ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు కొత్త పాలకవర్గం కృషి చేయాలని వైరా ఎమ్మెల్యే మాలోత్ రామదాసు నాయక్ అన్నారు. శుక్రవారం ఏన్కూరు వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో మార్కెట్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన గుగులోతు లచ్చిరాం నాయక్, మరియు మార్కెట్ డైరెక్టర్ ను ఎమ్మెల్యే మాలోత్ రామదాసు నాయక్ సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఖమ్మం జిల్లాలో పత్తి పంట అత్యధిక గా దిగుబడినిచ్చే మండలాల్లో ఏనుకూరు మండలం ప్రథమ స్థానంలో ఉంటుందని ఎమ్మెల్యే అన్నారు, ఈ ప్రాంతంలో పత్తి, మిర్చి, తోపాటు ఇతర పంటలు అధికంగా సాగు జరుగుతాయని, రైతుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని మార్కెట్ కు వచ్చే రైతుల కు సౌకర్యాలు కల్పించాలని పాలకవర్గాన్ని ఎమ్మెల్యే రామదాసు నాయక సూచించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ గుగులోతు లచ్చిరాం నాయక్, జిల్లా కాంగ్రెస్ నాయకులు శెట్టిపల్లి వెంకటేశ్వరరావు, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు, స్వర్ణ నరేందర్, మేడ ధర్మారావు, పంతగాని నరేష్, అజ్మీర సురేష్, సామేలు, మార్కెట్ డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.