పయనించే సూర్యడు //ఫిబ్రవరి //10//హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ //కుమార్ యాదవ్..హైదరాబాద్ లోని ఎల్బీనగర్ ఇండోర్ స్టేడియంలో ఆదివారం జరిగిన మార్షల్ ఇంటర్నేషనల్ కరాటే ఛాంపియన్షిప్ కరాటే పోటీలలో గ్లోబల్ షోటొఖాన్ కరాటే డూ ఇండియా హుజురాబాద్ విద్యార్థులు ప్రతిభ చాటారు. 12 సంవత్సరాల బ్లాక్ బెల్ట్ కేటగిరి కటాస్ లోఎస్.కె షాదుల్లా బాబా గోల్డ్ మెడల్, 15 సంవత్సరాల అమ్మాయిల విభాగంలో ఆరెంజ్ కేటగిరిలో కటాస్ జన్ను కావ్య గోల్డ్ మెడల్, 14 సంవత్సరాల అమ్మాయిల విభాగంలో కటాస్ లో ఓ సన్నిహిత గోల్డ్ మెడల్, 8 సంవత్సరాల విభాగంలో అమ్మాయిల కేటగిరి కటాస్ లో హమేరా తస్లీ గోల్డ్ మెడల్, 13 సంవత్సరాల అబ్బాయిల విభాగంలో వైట్ బెల్ట్ కేటగిరీ లో ఆదిత్య వర్ధన్ గోల్డ్ మెడల్, 11 సంవత్సరాలు ఎల్లో బెల్ట్ కేటగిరీలో సిహెచ్ సాయి చరణ్ కటాస్ లో సిల్వర్ మెడల్, ఆరు గోల్డ్ మెడల్స్, ఒకటి సిల్వర్ మెడల్ ఈ కరాటే పోటీలలో పాల్గొని బహుమతులు సాధించారన్నారు. ఈ విద్యా ర్థులను హుజురాబాద్ టౌన్ సిఐ తిరుమల్ గౌడ్, తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్, తెలంగాణ రిటైర్డ్ ఆల్ పెన్షనర్స్ అసోసియేషన్ కరీంనగర్ జిల్లా శాఖ అధ్యక్షులు చందుపట్ల జనార్దన్, టౌన్ ఎస్ఐ యూసుఫ్ అలీ, ఏఎంసి మాజీ డైరెక్టర్ ఖాలిద్ హుస్సేన్, మైనార్టీ నాయకుడు మహమ్మద్ అలీమ్, జ్యోతిరావు పూలే కమిటీ చైర్మన్ ఉప్పు శ్రీనివాస్ పటేల్, ఫ్రూట్స్ వ్యాపారి మొహమ్మ ద్ సలీం, న్యూ కాకతీయ స్కూల్ ప్రిన్సిపాల్ బి రాజ్ కుమార్, డైరెక్టర్స్ టీ గోపాల్, ఏం వెంగళ రావు, గ్లోబల్ షోటోఖాన్ కరీంనగర్ జిల్లా అసోసియేషన్ అధ్యక్షులు అంబాల ప్రభాకర్, తులసి లక్షణామూర్తి. తదితరులు ఈ సందర్భంగా విద్యార్థులను అభినందించి హర్షం వ్యక్తం చేశారు.