పయనించే సూర్యుడు ప్రతినిధి ఆగస్టు, 25:- ప్రత్తిపాడు నియోజవర్గం ఇంచార్జ్ ఎం. రాజశేఖర్ ) కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం,ఏలేశ్వరంలో వినాయక చవితి సందర్భంగా మార్స్ కంప్యూటర్ అధినేత అడపా దుర్గారావు ఆధ్వర్యంలో ఉచితంగా 900 మట్టి వినాయక ప్రతిమలను భక్తులకు పంపిణీ చేశారు.13 సంవత్సరాలగా మార్స్ కంప్యూటర్స్ ఆధ్వర్యంలో ఉచితంగా మట్టి వినాయక ప్రతిమలు పంపిణీ చేపట్టిన దుర్గారావుని పలువురు అభినందించారు.ఈ సందర్భంగా దుర్గారావు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి వినాయకుడుని పూజించి వినాయక చవితి పండుగను జరుపుకోవాలని కోరారు.గ్రామాలలో వినాయక మండపాలలో మట్టి విగ్రహాలను ప్రతిష్టించాలని కోరారు.ఈ కార్యక్రమంలో కోరాడ శ్రీనివాస్,సాలా మల్లిబాబు,కోరాడ రాజు,ప్రగడ మధు,కర్రి చైతన్య, వెంకీ,చంటిబాబు, నూకరత్నం,రత్నం,తదితరులు పాల్గొన్నారు.