పయనించే సూర్యుడు రీపోట్టర్ జల్లి.నరేష్ చింతూరు ఇంచార్జ్ అక్టోబర్ 23
అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండల కేంద్రంలో శుక్రవారం మావోయిస్టులు భారత్ బంద్ కు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్, ఎడిషనల్ ఎస్పీ( ఆపరేషన్ ) జగదీష్ హడహళ్లి , సీఐ గోపాలకృష్ణ ఆదేశాల మేరకు చింతూరు పోలీసులు అప్రమత్తమయ్యారు. చింతూరు మీదుగా వెళ్లే ప్రతి ఆర్టీసీ బస్సులను, మ్యాజిక్కులను, ద్విచక్ర వాహనదారులను, వివిధ వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ నిర్వహిస్తున్నారు. చింతూరు ఎస్సై పి. రమేష్ ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్ ఎదుట తనిఖీలు చేపట్టారు. అలాగే చింతూరు మీదుగా భద్రాచలం వెళ్లే ప్రతి వాహనాన్ని అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ముందు జాగ్రత్త చర్యగా కూనవరం మీదుగా వాహనాలను మళ్లిస్తున్నారు. రోడ్డు నిర్మాణానికి సంబంధించి యంత్రాలను సురక్షిత ప్రాంతాలలో భద్రపరచుకోవాల్సిందిగా ఎస్ఐ కోరారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, సిఆర్పిఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు