పయనించే సూర్యుడు బాపట్ల సెప్టెంబర్ 23 :- రిపోర్టర్( కే. శివ కృష్ణ)
కర్లపాలెం మండలంలో రహదారులు అధ్వానంగా ఉన్నాయని ప్రభుత్వాలు మారిన తమ గ్రామానికి ఉన్న రహదారి పాడైన అసలు నాయకులు హామీ ఇస్తున్నారే కానీ పట్టించుకోవటం లేదని కర్లపాలెం మండలం పెద్ద పులుగువారిపాలెం, గణపవరం గ్రామాలకు చెందిన యువకులు సోమవారం ర్యాలీగా ఆ గ్రామాల నుంచి బయలుదేరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. రహదారి మీద పెద్దపెద్ద గుంతలు ఏర్పడి వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారని, ఎన్నో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, ఎన్నిసార్లు మొరపెట్టుకున్న అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించడం లేదని యువకులు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే తమ గ్రామానికి ఉన్న రహదారిని నూతనంగా ఏర్పాటు చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. మొత్తం మీద గ్రామానికి కావలసిన రహదారి కోసం యువకులు ర్యాలీగా తరలి వెళ్ళటం చర్చనీయాంశమైంది.