పయనించే సూర్యుడు ఆగస్టు 12.08.2025 చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గ 0 చౌడేపల్లి మండలం రిపోర్టర్ జె. నాగరాజ)
రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి జైలు నుంచి విడుదల కావాలని కోరుతూ శక్తి స్వరూపిణి బోయకొండ గంగమ్మ ఆలయం వద్ద ఆ పార్టీ నాయకులు 1116 కొబ్బరికాయలు కొట్టి అమ్మవారిని మొక్కుకున్నారు ఈ సందర్భంగా మండల వైకాపా అధ్యక్షుడు నాగభూషణ్ రెడ్డి ప్రసంగిస్తూ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని అన్యాయంగా జైలు పాలు చేశారని ఆయన కడిగిన ముత్యంలా బయటకు వస్తారని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రశ్నించే వారిపై ఇలాంటి చర్యలు చేపట్టడం కూటమి ప్రభుత్వానికి తగదన్నారు అనంతరం బోయకొండ గంగమ్మకు విశేష పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో బోయకొండ మాజీ చైర్మన్ మిద్దెంటి శంకర్ నారాయణ సుబ్రహ్మణ్యం రాజు పాల ఏకీరుల రాష్ట్ర మాజీ సభ్యుడు లడ్డు రమణ మాజీ ఎంపీపీ రుక్మిణమ్మ మండల ఉపాధ్యక్షుడు సుధాకర్ రెడ్డి సర్పంచ్ షంషేర్ ఓబులేసు ఓబుల్ రెడ్డి వైకాపా నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు