పయనించే సూర్యుడు సెప్టెంబర్ 21 పెద్ద శంకరంపేట్ మండలం మెదక్ జిల్లా.( రిపోర్టర్ జిన్నా అశోక్ ) మండలల్లోని ప్రభుత్వ, ప్రవేట్ పాఠశాలల్లో శనివారం ముందస్తు బతుకమ్మ సంబురాలు నిర్వహించారు. పెద్ద శంకరంపేట కేంద్రంలోని మంథని స్కూల్, శ్రీ సాయి చైతన్య, సంస్కార్ డాన్ బాస్కో తో పాటు వివిధ ప్రభుత్వ పాఠశాలల ప్రాంగణాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలను నిర్వహించారు. ఈ బతుకమ్మ వేడుకల్లో తెలంగాణ సాంప్రదాయ పండుగ ఆయన బతుకమ్మ ప్రాముఖ్యతను తెలియజేస్తూ విద్యార్థినులు, అధ్యాపకులు ఉత్సాహంతో పాల్గొన్నారు. అంతా కలిసి పూలతో బతుకమ్మలను తయారు చేశారు. బతుకమ్మ ఆటపాటలతో సందడి చేశారు.