తెలుపుతూ: బీ.సీ. ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు దస్తగిరి నాయుడు
పయనించే సూర్యుడు జిల్లా ఇన్చార్జి శ్రీకాంత్ (15: జనవరి) (ఆదోని నియోజకవర్గం)... ఈరోజు ఆదోని డివిజన్ బీసీ ఫెడరేషన్ స్థానిక కార్యాలయం నందు తాలూకా అధ్యక్షులు రమేష్ ఆచారి అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేయడమైనది. ఈ సమావేశం నందునూతనఎన్నుకోబడినటువంటి కమిటీ సభ్యులకు, రాష్ట్ర ఉపాధ్యక్షులు దస్తగిరి నాయుడు చేతుల మీదుగా అధికారిక పత్రాలు, ఐడెంటి కార్డులు, ఇవ్వడం జరిగింది. తదనంతరము రాష్ట్ర ఉపాధ్యక్షులు దస్తగిరి నాయుడు మాట్లాడుతూ బీ.సీ.ఫెడరేషన్ నందు ఉన్నటువంటినాయకులు ప్రతి ఒక్క సభ్యుడు కూడా అకంఠి త దీక్షతో పని చేయాలని ప్రతి ఒక్క సభ్యుడు కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ, ఎక్కడైనా ఏదైనా సమస్యలు ఉంటే గాని, మీకు తెలిసిన వెంటనే వారికి అందుబాటులో ఉండి సాయం చేయాలని హితవు పలకమైనది. అలాగే మా బీసీ ఫెడరేషన్ తరఫున ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ సేవలు చేస్తామని చెప్పడం జరిగింది.ఈ కార్యక్రమంలో డివిజన్ వైస్ ప్రెసిడెంట్ కత్తి హనుమంతరావు, సలహాదారులు బండారి రాజేశ్వరరావు, పట్టణ వైస్ ప్రెసిడెంట్ జి. రామదాసు, జనరల్ సెక్రెటరీ బి.మల్లేశ్వరప్ప, ఆర్గనైజింగ్ సెక్రటరీ నరసింహులు, పట్టణ సలహాదారులు బెస్త ప్రకాష్,జాయింట్ సెక్రెటరీ చిన్న ఈరప్ప, పగడాల కిరణ్ కుమార్, కత్తి ప్రసాద్, దీపక్ బాబు,వేణుగోపాల్,సంజీవ్,తదితరులుపాల్గొన్నారు.