//పయనించే సూర్యుడు// న్యూస్// ఫిబ్రవరి//24//మక్తల్ ముంబై తెలంగాణ బహుజన ఫోరం (ఎంటిబిఎఫ్), మహాలక్ష్మి దొబిఘట్ రజక సంఘం ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం సంత్ గాడ్గేబాబా 149వ జన్మ దిన వేడుకలు ముంబై జాకబ్ సర్కల్లో ఘనంగా నిర్వహించారు. ఈ శుభ సందర్భంగా తెలుగు రజక సంఘం- అంటాప్ హిల్ అధ్యక్షులు నడిగోటి వెంకటేష్ కి కల్లూరి మల్లేష్ గారు "అభినవ బుద్ధుడు అంబేడ్కర్ గురువు సంత్ గాడ్గెబాబా" అనే గొప్ప గ్రంథాన్ని భేటీగా ఇవ్వగా, ఆంటాప్ హిల్ కన్వీనర్ *బొమ్మపాల వెంకటేష్ కు మహాలక్ష్మి దోభిఘాట్ రజక సంఘం ప్రముఖులు తడకపెల్లి నరేష్ గారు పుష్పగుచ్చం ఇచ్చి సన్మానించారు. అనంతరం పలు సంఘాల ప్రతినిధులు గాడ్గేబాబా జీవిత చరిత్రను సవిస్తరంగా వివరిస్తూ ఆయన హేతువాద దృక్పథాన్ని తామందరం అలవర్చుకోవాలని, ఆయన మానవీయ ఆశయాలను ఆచరణలో పెడదాం అంటూ శపథం చేశారు. ఈ జయంతి కార్యక్రమంలో ఆద్ర సేవా ఫౌండేషన్ కు చెందిన బందరాం రమేష్, భోగ హరికృష్ణ పద్మశాలి, కార్మిక నేత చౌవల్ రమేష్, నరపాక లక్ష్మణ్, దొభిఘాట్ నాయకులు యానాంపల్లి బాలకృష్ణ, ప్రవీణ్ కాన్రాజ్, కమ్మార్పల్లి రమేష్, న్యావనంది రాజేష్, ఎంటీబిఎఫ్ నేతలు చాంద్ అహ్మద్, డి.రాజు మహారాజ్, భీంరత్న మాలజీ, మూలనివాసి మాలజీ పాల్గొన్నారు.