పయనించే సూర్యుడు రీపోటర్ జల్లి నరేష్ డివిజన్ ఇంచార్జి ఆగస్టు 11
ముఖ్యమంత్రి గారు జిసిసి గిరిజనుల కోసమా,గిరిజనేతరుల కోసమా అని భారత్ ఆదివాసీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు,ఆంధ్ర ప్రదేశ్ ఆదివాసీ జెఏసి రాష్ట్ర వైస్ ఛైర్మన్ మొట్టడం రాజబాబు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై తీవ్ర స్థాయిలో ద్వజమెత్తారు. .ప్రపంచ ఆదివాసీ దినోత్సవం నాడు ముఖ్యమంత్రి పాడేరు వస్తున్నారంటే ఆదివాసీలకు మంచి జరుగుతుందని ఆదివాసీలు ఆశాభావంతో ఎదురుచూస్తున్న సమయంలో 1/70 భూబదాలయింపు నిషేధ చట్టం సవరించాలన్న సభాపతి అయ్యన్న పాత్రుడు కళ్లలో ఆనందం కోసం, ఆయన నియోజకవర్గంలోగల మాకవరపాలెం మండలం శెట్టిపాలెంలో గిరిజన సహకార సంస్థ ఆధ్వర్యంలో 10 కోట్ల రూపాయల వ్యయంతో కాఫీ ప్రాసెసింగ్ యూనిట్ ని వర్చువల్ గా ముఖ్యమంత్రి పాడేరు నుండి ప్రారంభించారు. దాంతో సుమారు 500 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి.ఈ 500 మంది ఎవరు ఉంటారో తెలియని అమాయకులుగా ఆదివాసీలను చూసిన చంద్రబాబు నాయుడు వ్యవహరశైలి అత్యంత అవమానకరంగా ఉందని,ఈ 500 ఉద్యోగాలు అయ్యన్న పాత్రుడు నియోజకవర్గంలో గల గిరిజనేతరులను నియమించుకొంటారని,అయినా గిరిజన సహకార సంస్థ సంస్థ గిరిజనులదైతే గిరిజనేతరులకు అవకాశాలు ఎలా ఇస్తారని,ఇప్పటికే జిసిసి గిరిజనేతరుల అడ్డాగా మారిందని,జిసిసి,ఐటిడిఏలు పేరుకే గిరిజనులవి,కానీ అక్కడ ఎక్కువ శాతం ఉద్యోగాలు గిరిజనేతరులవేనని, కాఫీ అత్యధికంగా పండే గిరిజన ప్రాంతమైనా చింతపల్లిలో జిసిసి కాఫీ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేయాలని,ఇక్కడ యూనిట్ కి కావల్సిన 11 ఎకరాల భూమి కన్నా ఎక్కువగా భూములు ఉన్నాయని,చింతపల్లి కాకపోతే పాడేరు, అరకులలో ఏర్పాటు చేయాలని లేని పక్షంలో ఆదివాసీలం పోరాటానికి సిద్ధంగా ఉన్నామని,తెదేపా,జనసేన,బిజెపి గిరిజన నాయకులు నోరు తెరవాలని లేని పక్షంలో మన్యం నుండి మైదానంలోకి వెళ్ళిపొండని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో భారత్ ఆదివాసీపార్టీ,ఆదివాసీ జెఏసి నాయకులు తెల్లం రవిప్రసాద్,కన్నప్పరాజు పాల్గొన్నారు.