
పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలువెలుగుల చక్రపాణి
గత ప్రభుత్వ నిర్లక్ష్యం పై అంతటా చర్చ జిల్లా నుంచి దేవదాయ శాఖ మంత్రి ఉన్న అధికార పార్టీ ఎమ్మెల్యే ఉన్న అప్పటి సీఎం రాకపోవడం పట్ల ప్రస్తుతం మరో సారి చర్చ
బాసరకు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ పది సంవత్సరాలుగా రాకపోవడం పట్ల ఇప్పుడు చర్చకు దారి తీసింది అప్పట్లో అధికార పార్టీలో ఎమ్మెల్యే ఉన్న, జిల్లా నుంచి దేవదాయ శాఖ మంత్రి ఉన్నప్పటికీ బాసర ఆలయం అభివృద్ధికి నోచుకోలేదని సర్వత్ర విమర్శలు వినిపిస్తున్నాయి బాసర ఆలయం పునర్నిర్మాణం చేపట్టాలని అసెంబ్లీలో ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ పలుమార్లు కోరారు. మాస్టర్ ప్లాన్ అమలు అంశం , బాసర కు సంబంధించిన పలు సమస్యలపై శాసనసభలో మాట్లాడారు. మంత్రులను కలుస్తూ, నిర్మల్ జిల్లా పర్యటనకు ముఖ్యమంత్రి వచ్చిన సందర్భంగా బాసర పర్యటనకు రావాలని ఆహ్వానించారు. ఆలయ పునర్నిర్మాణం కాకపోతే దీక్షకు దిగుతానని దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సమక్షంలో చెప్పారు. ప్రస్తుతం సీఎం వస్తుండటం తో ఇకనైనా బాసరకు మహార్దశ వస్తుందన్న సంతోషం ప్రజల్లో వ్యక్తం అవుతుంది.