పయనించే సూర్యుడు: మార్చి 21: ములుగు జిల్లా వాజేడు మండల ప్రతినిధి. రామ్మూర్తి. ఎ.
వాజేడు: ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని తెలంగాణ రాష్ట్ర వాడబలిజ సేవా సంఘం అధ్యక్షుడు డర్రా దామోదర్ మాట్లాడుతూ
తెలంగాణ శాసనసభలో బీసీలకు 42% శాతం రిజర్వేషన్ కల్పించినందుకు గాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వతంత్రం వచ్చిన దగ్గర నుండి బీసీలకు అన్యాయం జరుగుతూనే ఉంది ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక దృష్టి తీసుకొని శాసనసభలో ఏకగ్రీవంగా బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించడం ఎంత సంతోషకరంగా ఉందని తెలియజేశారు. 42% రిజర్వేషన్ కొరకు శాసనసభలో సహకరించినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు బిఆర్ఎస్ పార్టీ నాయకులకు బిజెపి పార్టీ నాయకులకు సిపిఎం సిపిఐ నాయకులకు మరియు శాసనసభలో సహకరించిన శాసనసభ్యులందరికీ మరియు శాసన మండలి సభ్యులకు ప్రత్యేకించి బీసీల హక్కుల కొరకు అనునిత్యం పోరాడుతున్న ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసిన తెలంగాణ రాష్ట్ర వాడబలిజ సేవా సంఘం. అయితే దురదృష్టం ఏంటి అంటే దేవుడు వరం ఇచ్చిన పూజారి కానికరించట్లేదన్న విధంగా ఏజెన్సీ ప్రాంతంలో నివసిస్తున్న బీసీ కుల సంఘాలకు ఎటువంటి హక్కులు లేకపోవడం బాధాకరం ఉందని అందులో ప్రత్యేకంగా ఈ గోదావరి పరివాహక ప్రాంతంలో నివసిస్తున్నటువంటి వాడబలిజ కులస్తులు ఈ గోదావరి మహారాష్ట్ర నాసిక్ లో పుట్టి తెలంగాణ మీదుగా 1465 కిలోమీటర్లు ప్రయాణం చేస్తూ భారతదేశంలోనే పొడవైన నదుల్లో రెండవ నదిగా గోదావరి ప్రవహిస్తూ ఆంధ్రప్రదేశ్ నరసాపురం దగ్గర సముద్రంలో కలిసేంతవరకు గోదావరికి ఇరువైపులా మూడు రాష్ట్రాల్లో వాడ బలిజ కులస్తులు నివసిస్తున్నప్పటికీ తెలంగాణలోని అత్యధిక జనాభా కలిగిన ఆదిలాబాద్, కొమరం భీమ్, ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి,ములుగు, భద్రాది కొత్తగూడెం జిల్లాల్లో లక్షలాది జనాభా వందల సంవత్సరాల ముందు నుండి నివసిస్తున్నటువంటి మా కులస్తులకు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చట్టాల వలన తీరని అన్యాయం జరుగుతుందని ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి చట్టాల కన్నా ముందు నుండి నివసిస్తున్న మాకు ఈ ప్రాంతంలో సర్వహక్కులు కల్పించాలని లేనియెడల ఇక్కడ ఉన్నటువంటి చట్టాలపై 50% హక్కులు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.