
పయనించే సూర్యుడు అక్టోబర్ 27,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న
నంద్యాల జిల్లాలోని బాధితులకు ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి సిఫారసులతో మంజూరైన ముఖ్యమంత్రి సహాయ నిధి రూ. 4,26,627లక్షల చెక్కులను మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నాయకులు బైరెడ్డి రాజశేఖరరెడ్డి బాధితులకు సోమవారం నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి కార్యాలయంలో పంపిణి చేశారు. నందికొట్కూరు పట్టణం మారుతీ నగర్ బి. రాజేష్ కు రూ. 20,227వేలు, కొత్తపల్లి మండలం శివపురం గ్రామానికి చెందిన బోయ జయంతికి రూ. 43,734 వేలు, మిడ్తూరు గ్రామానికి చెందిన టి. వేధవతమ్మకు రూ. 81,000 వేలు, ఓర్వకల్లు మండలం శకునాల గ్రామానికి చెందిన రాజశేఖరరెడ్డి కి రూ. 1,00,597 లక్షలు, కొత్తపల్లి మండలం ముసలిమడుగు గ్రామానికి చెందిన బోయ అరుణ కు రూ. 1,17,00 లక్షలు, ప్రకాష్ నగర్ కు చెందిన జే. లక్ష్మణ్ కు రూ. 63,368 వేలు, మొత్తం రూ. 4,26,627 లక్షల చెక్కులు బాధితులకు మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతో అండగా నిలుస్తుందని, ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి సిఫారసులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెంటనే పరిగణలోకి తీసుకొని బాధితులకు అండగా నిధులు విడుదల చేయడం సంతోషకరం అన్నారు. బాధితులు కూడా సీఎం రిలీఫ్ ఫండ్ నిధులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
