
పయ నించే సూర్యుడు జూలై 3 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ : డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజవర్గం ఐ పోలవరం మండలం మురమళ్ళ గ్రామానికి చెందిన గంజా స్వరాజ్య లక్ష్మి భర్త గంజా సుధాకరావుకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన 2 లక్షల 63 వేల 719 రూపాయల విలువైన చెక్కును ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు అందజేశారు.మురమళ్ళలోని శాసనసభ్యుల కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో దాట్ల సుబ్బరాజు మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో భరోసా ఇస్తోందన్నారు.అత్యవసర వైద్య చికిత్సలు, విద్యతో పాటు ఇతర అవసరాల కోసం ప్రభుత్వం అందిస్తున్న ఈ సహాయం ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని, అవసరమైన సమయంలో ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రజల పక్షాన నిలిచి అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.