పయనించేసూర్యుడు/జనవరి 13/కాప్రా ప్రతినిధి సింగం రాజు:డాక్టర్ ఏఎస్ రావు నగర్ డివిజన్ జమ్మిగడ్డ బిజెఆర్ కాలనీలో ఉప్పల్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి మందమల్ల పరమేశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకుఆదివారం డివిజన్ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ సూoకు శ్రీకాంత్ రెడ్డి,సహాయ సహకారాలతో డివిజన్ ఎస్ఎస్ఎల్ ప్రెసిడెంట్ ఉష అనిల్ కుమార్,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మామిడి శ్రీనివాస్,ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీలకు స్థానిక మహిళలు నుంచి విశేష స్పందన లభించింది.పోటీలో సుమారు150 మంది మహిళలు పాల్గొని అందమైన రంగుల వళ్లులు తీర్చిదిద్దారు. డాక్టర్ ఏఎస్ రావు నగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ పాజ్జురి పావనిమణిపాల్ రెడ్డి.కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బొజ్జ రాఘవరెడ్డి,మేడ్చల్ జిల్లా ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ పత్తి కుమార్,ముగ్గులను పరిశీలించారు.పోటీల్లో ప్రథమ బహుమతి నవ్య,ద్వితీయ బహుమతి రేణుక,తృతీయ బహుమతి దీపిక గెలుచుకున్నారు.వీరికి సుంకు శ్రీకాంత్ రెడ్డి,పావని రెడ్డి రాఘవరెడ్డి,పత్తి కుమార్,పెద్ది శ్రీనివాస్,పాతకోటి రామలింగం,సింగం కిరణ్,నరసింహ,సభ అధ్యక్షులు బాజీ భాష, ముగ్గులు లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి బహుమతులు అందించారు.కాలనీవాసులు తాండూర్ గగన్ కుమార్, నరసింహ చారి,సింగం అరుణ్ కుమార్,తదితరులు పాల్గొన్నారు.