
పయనించే సూర్యుడుD.19.9.2026 నిజాంబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్. బాల్కొండ నియోజకవర్గం లో మున్సిపల్ పరిధిలో-నూతన గృహాలు, మడిగెలు, కమర్షియల్ షట్టర్లకు అనుమతి తప్పనిసరి కమిషనర్ డి. గజానంద్,భీంగల్ పట్టణ పురపాలక సంఘం పరిధిలో నూతన గృహాలు, మడిగెలు, కమర్షియల్ షట్టర్లు నిర్మించాలనుకునే వారు తప్పనిసరిగా మున్సిపల్ అనుమతి పొందిన తర్వాతే నిర్మాణ పనులు చేపట్టాలని మున్సిపల్ కమిషనర్ డి. గజానంద్ సూచించారు. మున్సిపల్ అనుమతి లేకుండా నిర్మాణాలు చేపడితే నోటీసులు జారీ చేయడంతో పాటు నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.పురపాలక సంఘం పరిధిలో నూతన నిర్మాణాలు చేపట్టాలనుకునే వారు ముందుగా ఆన్లైన్ విధానంలో మున్సిపల్ బిల్డింగ్ పర్మిషన్ కోసం దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. సంబంధిత అధికారులు పరిశీలించి అనుమతి మంజూరు చేసిన అనంతరం, మంజూరైన అనుమతులకు లోబడి మాత్రమే నిర్మాణ పనులు చేపట్టాలని సూచించారు.మున్సిపల్ అనుమతి లేకుండా నిర్మాణాలు చేపట్టినట్లయితే సంబంధిత నిర్మాణదారులకు నోటీసులు జారీ చేయడంతో పాటు, అవసరమైన సందర్భాల్లో ఎన్ఫోర్స్మెంట్ టీం ద్వారా అనధికార నిర్మాణాలను తొలగించే చర్యలు చేపట్టే అవకాశం ఉందని కమిషనర్ తెలిపారు. అనుమతులు పొందకుండా నిర్మాణాలు ప్రారంభించి తర్వాత ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి రాకుండా, కొత్త ఇళ్లు, మడిగెలు, కమర్షియల్ షట్టర్లు నిర్మించాలనుకునే వారు ముందుగానే మున్సిపల్ అధికారులను సంప్రదించి అవసరమైన అనుమతులు పొందాలని భీమ్గల్ మున్సిపల్ కమిషనర్ డి.గజానంద్ కోరారు.