పయనించే సూర్యుడు జనవరి 19 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండల రిపోర్టర్... అశ్వారావుపేట మండల గ్రామపంచాయతీని మున్సిపాలిటీగా ఏర్పాటు చేయడం. కాంగ్రెస్ పార్టీ నాయకులు. హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, మంత్రులు. బట్టి విక్రమార్క పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. తుమ్మల నాగేశ్వరరావు, ఆదేశాలతో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంచి పరిణామం చోటు చేసుకుందన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో మున్సిపాలిటీ ఉండి ఒక్క అశ్వారావుపేట నియోజకవర్గంలోనే లేదన్నారు. దాన్ని గుర్తించిన ముగ్గురు మంత్రులు. తీసుకున్న నిర్ణయంపై మున్సిపాలిటీలోని గ్రామాల ప్రజల సైతం ఆనందం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. మునిసిపాలిటీ నుంచి వచ్చే నిధుల ద్వారా అభివృద్ధి జోడెద్దుల గుర్రంలా పరిగెడుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ ప్రకారం త్వరితగతిన మున్సిపాలిటీ ఏర్పాటు చేసి కార్యాలయాన్ని నిర్మించాల్సిందిగా అధికారులను కోరారు. ఇంత గొప్ప నిర్ణయం తీసుకున్న ముగ్గురు మంత్రులకు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నట్టు పేర్కొన్నారు, ఈ కార్యక్రమంలో మండల నాయకులు జూపల్లి రమేష్, తుమ్మ రాంబాబు. సుంకవల్లి వీరభద్రరావు, జూపల్లి ప్రమోద్. నండ్రు రమేష్, కేదార్నాథ్. చిన్నంశెట్టి సత్యనారాయణ. పణి. నార్లపాటి రాములు, పసుపులేటి రామస్వామి. తదితరులు పాల్గొన్నారు