
పయనించే సూర్యుడు మార్చి 14 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ
ఈరోజు జనసేన పార్టీ 13 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ముమ్మిడివరం జనసేనపార్టీ కార్యాలయం వద్ద ఘనంగా నిర్వహించారు.జనసేనపార్టీ కార్యాలయం వద్ద ముమ్మిడివరం మార్కెటింగ్ కమిటీ చైర్ పర్సన్ ఓగూరి భాగ్యశ్రీ జనసేన జెండాను ఆవిష్కరించారు.అనంతరం జరిగిన సమావేశంలో నియోజవర్గ నాయకులు, కార్యకర్తల వీర మహిళల సమక్షంలో భారీ కేక్ ను కట్ చేసారు.ఇటీవల ముమ్మిడివరంలో జరిగిన అగ్ని ప్రమాదంలో పూర్తిగా దగ్ధమైన తాటాకిళ్ళు బాధితులను పరామర్శించి వారికి జనసేన నాయకులు 10వేలు,జగతా చంటి 5వేలు రూపాయల ఆర్థిక సాయం,గుద్దటి విజయ్ నిత్యవసర సరుకులు అందజేశారు.అనంతరం ముమ్మిడివరం టౌన్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేసి చలివేంద్రాన్ని ప్రారంభిచారు. ఈ కార్యక్రమంలో ఓగూరి భాగ్యశ్రీ, గుద్దటి జమ్మి,గోదశి పుండరీష్,దూడల స్వామి,కర్రా దుర్గాప్రసాద్,మద్దింశెట్టి పురుషోత్తం,అత్తిలి బాబురావు, మోకా బాల ప్రసాద్,ముత్యాల జయలక్ష్మి, బద్రి రమా,నూకల దుర్గ, గాలీదేవర బుల్లి, యలమంచిలి బాలరాజు,రంబాల రమేష్,పుణ్యమంతుల సూరిబాబు,రంబాల రమేష్, ఉండ్రు సత్యనారాయణ, లంకలపల్లి జమ్మి తదితరులు పాల్గొన్నారు