
పయ నించే సూర్యుడు ఆగస్టు 15: (ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ)డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం వ్యవసాయ మార్కెట్ యార్డులో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు దేశభక్తి భావంతో ఘనంగా నిర్వహించారు. ముమ్మిడివరం వ్యవసాయ మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ ఓగూరి భాగ్యశ్రీ, వైస్ చైర్మన్ గొల్లకోటి వెంకట్ రెడ్డి మరియు డైరెక్టర్ మట్టా సూరిబాబు మరియు ఇతర డైరెక్టర్లు ఆధ్వర్యంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దేశ స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన స్వాతంత్ర్య సమరయోధులకు ఘన నివాళులు అర్పించారు. దేశ ఐక్యత, సమగ్రత, సార్వభౌమత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు. వేడుకల్లో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిత్రపటాన్ని ఘనంగా ఆవిష్కరించి, వ్యవసాయ మార్కెట్ యార్డ్ కమిటీ కార్యాలయంలో ఏర్పాటు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వం, దేశ సేవ పట్ల తమ గౌరవాన్ని ఈ సందర్భంగా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ కమిటీ సభ్యులు, సిబ్బంది, రైతులు, వ్యాపారులు మరియు భారతీయ జనతా పార్టీ ముమ్మిడివరం పట్టణ అధ్యక్షులు సన్నిధిరాజు వీరభద్ర శర్మ, పట్టణ కార్యదర్శి బసవ శ్రీ హరిబాబు పాల్గొని స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.